పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

పద్మపురాణము


క.

కారణము కార్యకర్తలు
సారాంశము శుద్ధసత్త్వసంపన్నతఁ బెం
పారెడు నీ కీనిద్రకుఁ
గారణ మిది యేమి మేలుకను మఖిలేశా!

18


తే.

దేవ! సర్వేశ! ననుఁ గృపాదృష్టిఁ జూచి
నీ శరీరమునందున్న నిఖిలజగము
నుదయమయ్యెడువిధమెల్ల నొనరఁ జెప్పి
నాకుఁ గృపసేయు మిప్పుడు లోకనాథ!

19


వ.

అనినం బరమేష్ఠి పలుకు లాకర్ణించి యప్పరమేశ్వరుండు యోగ
నిద్రవలన మేల్కని తచ్ఛయనంబునం గూర్చుండి లోకంబులు
పుట్టింప నుపక్రమించి కొంతసేపు నిమిలీతాక్షుండై [1]చింతించు
చుండ నుదకమధ్యంబున జగదద్భుతాకారంబై హిరణ్మయం బగు
నొక్కయండం బుదయించెఁ దత్కటాహమధ్యంబునందుఁ
జతుర్దశభువనంబులును సప్తసాగరకులపర్వతసమేతంబుగా
భూతధాత్రియు నుదయించెఁ దద్బ్రహ్మాండమధ్యంబున కెల్ల
నధిపతిగా బ్రహ్మ నాజ్ఞాపించి తదనంతరంబ.

20


సీ.

శ్రీనాథుఁ డొకకొంత చింతింప నలికభా
        గమునందు సన్నంపుఁజెమట [2]పుట్టె
నది [3]బుద్బుదాకారమై భువిం బడుటయు
        నందు మహాశూలహస్త మమర
[4]మేలికెంజడలతో ఫాలలోచనముతో
        నపు డేను జనియించి యతనిమ్రోలఁ
బని యేమి నా కని వినమితాంగుఁడనైన
        ననుఁ జూచి నవ్వుచు నగధరుండు

  1. నిద్రించుచుండ (ము)
  2. వొడమె (మ-తి-హై)
  3. యద్భుతాకారమై (ము)
  4. మేలికజడలతో (ము)