పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

పద్మపురాణము


క.

అని విన్నవించు మాటలు
విని కరుణ దలిర్ప మోము వికసిల్లఁగ న
న్వనరుహనేత్రుఁడు ప్రకృతిం
గనుఁగొని వెస నందుఁ బొందెఁ గడునెయ్యమునన్.

11


తే.

అఖిలజగదీశ్వరుండగు నచ్యుతుండు
ప్రకృతితోఁ గూడి కేవలప్రకృతిపురుషుఁ
డనఁగ లీలావిభూతిఁ బెం పగ్గలించి
[1]ప్రకటమగు సృష్ టిసేయ నుపక్రమించె.

12


వ.

అపుడు బ్రహ్మాదిభూతంబులకు నాదియైన మహత్తును నమ్మహ
త్తునకు నహంకారంబును నయ్యహంకారంబునకుఁ బంచతన్మా
త్రలునుం బంచతన్మాత్రలకుఁ బంచభూతంబులునుం జనియించె
నందుఁ బ్రథమభూతంబైన యాకాశంబునకు వాయువును వాయు
వునకు నగ్నియును నగ్నికి నుదకంబును నుదకంబునకుం
బృథివియుం బుట్టె. ఆయాకాశాదిభూతంబు లేకోత్తరగుణకంబులై
యుండు నందు శబ్దస్పర్శరూపరసగంధంబులు పుట్టె. తద్గుణ
మిశ్రంబున బ్రహ్మాండంబు పుట్టె. దానివలనఁ జతుర్దశభువనం
బులు పుట్టె. అందు బ్రహ్మాదిదేవతలును దేవమనుష్యస్థావర
[2]తిర్యగ్విధంబులై చతుర్విదభూతంబులును బుట్టె. అవియును
దత్తత్కర్మానురూపంబుల దేవాదియోనులం బ్రవేశించి ప్రకృతి
యందుఁ బొంది యాత్మం జనియించుచు నింతకుఁ గారణభూతం
బైన నారాయణుచేత నియమితంబయిన యిది మహాసర్గంబునాఁ
బడునని చెప్పిన విని పార్వతి యి ట్లనియె.

13

బ్రహ్మాదిసంభవప్రకారము :

చ.

పురహరసృష్టియం దఖిలభూతములున్ జలజాసనాద్యమౌ
సురనికరంబు నేగతిఁ బ్రసూతి వహించెను సర్వలోకసుం
దరుఁ డగు విష్ణుదేవుఁ డవతారము లేగతిఁ [3]దాల్చె నంతయున్
బరువడి విస్తరింపు మని పల్కిన గౌరికి శంభుఁ డిట్లనున్.

14
  1. ప్రకటముగ (హై)
  2. తిర్యగ్విభవంబులై (ము)
  3. దాల్చు (ము)