పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

219


తే.

కమలలాంఛనహస్తలై కమలనేత్రుఁ
గొలిచియుండుదు రెప్పుడు కొమరు మిగిలి
విహగనాయకశేషాహివిబుధవరులు
నిత్యముక్తులు గొలుతురు నియమ మెసఁగ.

158


ఆ.

అఖిలభోగలీల ననవరతంబును
గనులతోడఁ గూడి కంజనయనుఁ
డతివిశాలరమ్యమైన సింహాసనం
బునను వెలుఁగుచుండు వనజనయన!

159


క.

అని చెప్పి గిరితనూజకు
మనసిజహరుఁ డనియె నిట్లు మఱియును దద్వ్యూ
హనిరూఢిభేదముల న
య్యనుపమలోకములు విను నగాధిపతనయా!

160

విష్ణులోకావరణభేదనిరూపణము :

వ.

అఖిలవైభవారూఢం బగు నప్పరమపదంబునకుఁ బ్రథమావర
ణంబునందుఁ బూర్వభాగంబున వాసుదేవమందిరంబును నాగ్నే
యంబున లక్ష్మీలోకంబును యామ్యంబున సంకర్షణనివాసంబును
నైరృతంబున సరస్వతీస్థానంబును పడమట ప్రద్యుమ్న
సదనంబును (వాయవ్యంబున రతిసద్మంబును) నుత్తరం
బున ననిరుద్దగేహంబును నీశానభాగంబున నుషాసౌధంబును
గలిగియుండు. ద్వితీయావరణంబున [1]కేశవాదిచతుర్వింశతి
లోకంబులును, తృతీయావరణంబున మత్స్యకూర్మాద్యవతారంబు
లును, చతుర్థావరణంబున సత్యాచ్యుతానంతవిష్వక్సేనదుర్గా
గణపతిశంఖ[2]పద్మవిధిలోకంబులును, పంచమావరణంబున
ఋగ్యజుస్సామాధర్వణంబులును సావిత్రియు విహగేంద్రుండును
ధర్మంబులు వాఙ్మయములును, షష్ఠావరణంబున శంఖచక్రగదా
పద్మఖడ్గశార్జ్గహలముసలాద్యనేకాయుధంబులును మంత్రాక్షరం

  1. మత్స్యలోకంబును (ము)
  2. పద్మాదిలోకంబులును (ము)