పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

పద్మపురాణము


బులును, సప్తమావరణంబున నింద్రాగ్నియమనిరృతివరుణ
వాయుకుబేరేశానాదులును, అష్టమావరణంబున సాధ్యమరు
ద్విశ్వేదేవతాగణంబులు గలవు. నిత్యు లందు విహరింతురు. తక్కిన
దేవతలు ప్రాకృతకాలంబున నిత్యులై నాకసుఖం బనుభవింతురు
గాని యిందుఁ బొందనేర రట్లు గావున.

161


మత్త.

నిత్యముక్తులు విష్ణుభక్తులు నిర్మలాత్ములు భోగసాం
గత్యులు న్వనితాజనంబులు గారవంబునఁ గొల్వఁగా
నత్యుదాత్తావిలాసలీలల నచ్యుతుండు మునీంద్రసం
స్తుత్యుఁడై చెలువొందు నిందిరతోడఁ దత్పుర మేలుచున్.

162


శా.

వేదంబుల్ పఠియించి యాగవితతుల్ విఖ్యాతిగాఁ జేసి యో
గాదిజ్ఞానవివేకియై సకలదానారూఢుఁడై [1]సర్వవి
ద్యాదక్షుండగునేనియున్ ద్వయసుమంత్రజ్ఞాని గాకున్న ద్వై
పాద్యైశ్వర్యపదంబు వేఱొకగతిం బ్రాపింపఁగా నేర్చునే.

163


ఆ.

అని శివుండు గిరిజ కానతి యిచ్చిన
విష్ణులోకమహిమ విని మనమున
విస్మయంబుఁ బొంది వినతయై యటమీఁది
కథ వినంగ వేడ్క గలదు నాకు.

164


వ.

అత్తెఱం గెఱింగింపు మని యడుగుటయు.

165


శా.

విద్వత్సంస్తుతవాగ్విలాస! త్రిజగద్విఖ్యాతచారిత్ర! రా
గద్వేషాదివికారదూర! రమణీకందర్ప! శ్రీవిష్ణుపా
దద్వంద్వస్థితహృత్సరోరుహ! మహాదానైకరాధేయ! స
ప్తద్వీపార్ణవచక్రవాళగిరిభాస్వద్వర్తికీర్తిప్రియా!

166


క.

చండరిపుమండలేశ్వర
దండాధిప[2]కమలషండదారుణమదవే
దండ! నృపనీతిమండన!
పండితహృత్పుండరీక పంకరుహాప్తా!

167
  1. తత్త్వ (తి-హై)
  2. విమల (ము)