పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

పద్మపురాణము

త్రిపాద్విభూతిమహత్త్వము :

వ.

మఱియుఁ ద్రిపాద్విభూతిప్రకారంబు సెప్పెద నాకర్ణింపుము.
బ్రహ్మాండపరమపదమధ్యంబున సీమాకారయై విరజయను నొక్క
నది గలదది యెట్టి దనిన.

130


శా.

వేదాంగుం డగు విష్ణుదేవుని తనుస్వేదాంబుపూరంబునం
బ్రాదుర్భావము నొంది తా విరజనాఁ బ్రఖ్యాతయై పెంపు సం
పాదించుం దగు నమ్మహానది లసత్పారంబునం దోరమై
శ్రీదేవేశుని పట్టణంబు వొలుచన్ శ్రీభోగభాగ్యోన్నతిన్.

131


వ.

అదియునుం బరమవ్యోమం బమృతంబు [1]శాశ్వతంబు [2]సత్యంబు
నిత్యంబు శుద్ధసత్త్వమయంబు దివ్యం బక్షరంబు విష్ణుమందిరంబు
వైకుంఠంబు నిత్యంబు సనాతనంబు సర్వలోకోత్కృష్టంబు బ్రహ్మ
పదం బవ్యయంబు నాఁ బర్యాయనామంబులు గలిగి యనేకకోటి
సూర్యాగ్నితుల్యతేజోవిరాజమానంబై సకలదేవతామయంబై
బ్రహ్మానందంబై సమానాధికరహితంబై యాద్యంతశూన్యంబై
యతులితాద్భుతరమ్యంబై విలసిల్లుచుండు.

132


సీ.

రవిచంద్ర[3]తారకప్రభలు వర్తిల్లక
        దివము రాత్రియు లేక తేజరిల్లు
హరచతుర్ముఖసురేంద్రాదులకై నను
       నప్రవిష్టద్వారమై వెలుంగు
నెట్టకేలకు నందు [4]కేగిన పుణ్యులు
       మరలి రాకుందురు మాననీయ
హరిపదాబ్జధ్యాతలగు మహాయోగీంద్ర
       విప్రాలయంబులు వెలయుఁ బెక్కు

  1. శాశ్వతపదంబు (మ-తి-హై)
  2. సత్యం బనంతంబు పరమంబు (మ-తి-హై)
  3. పావక (హై)
  4. నరిగినవారలు, మగిడి రా రెన్నఁడు (ము-యతిభంగము)