పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

పద్మపురాణము


[1]యేదేవి కడగంట నెప్పుడు జంగమ
        స్థావరాత్మకమైన జగము నిల్చి
[2]యుండు నందు నిమీలనోన్మీలనంబుల
       నుత్పత్తిలయములు నొందుచుండు


తే.

నట్టి యీశ్వరి త్రిగుణాత్మ యాదిలక్ష్మి
[3]సర్వజగములు వినుతించు సన్నుతాంగి
తనదు తేజంబు పెంపునఁ దానె జగము
శూన్యమగుచోట నిండంగఁ జూచు నెపుడు.

117


వ.

అమ్మహాదేవి లక్ష్మియు ధరణియు నీలయునాఁ ద్రిగుణాత్మికయై
ప్రవర్తిల్లు నందు లక్ష్మి[4]ధనవాగ్రూపంబు లధిగమించియుండు
ధరణి జగదాధారశక్తి వహించియుండు నీల తోయాదిరసరూపా
త్మికమై యుండు. నిమ్మూడువిధంబులు దానయై యప్పద్మ
వాసిని జగన్న్మాథుండగు హరి నాశ్రయించియుండు మఱియును.

118


శా.

స్త్రీరూపంబులు దానయై చెలఁగి[5]వర్తించున్ సమస్తైకవి
ద్యారూపంబులు దానయై నెగడు సౌందర్యైకసౌభాగ్యశీ
లారూఢు ల్దనరూపమై పఱఁగి నిత్యశ్రీలఁ బెంపొందు నా
పారావారతనూజ యెల్లయెడలం బంకేజప్రతేక్షణా!

119


మ.

కమలాపాంగవిలోకనం బయుతభాగంబందుఁ దన్మాత్రనా
ప్రమథేశాచ్యుత పుండరీక భవశక్రశ్రీల ధర్మానిలా
ర్యమచంద్రాదులు నిత్యవైభవములం బ్రాపించుచుం దేవతో
త్తములై యొప్పుదు రమ్మహామహిమ యేతన్మాత్రమే పార్వతీ!

120
  1. యద్దేవి (ము-యతిభంగము)
  2. యుండి యందు (తి)
  3. సర్వజగముల విహరించు (తి-హై)
  4. తన (ము)
  5. వర్తింపన్ (ము)