పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

పద్మపురాణము


ఆ.

సకలభూతములును జలజజుండును హరి
దాసవర్గ మగుటఁ దలఁచి మంత్ర
మధిగమింపవలయు నమ్మంత్రతాత్పర్య
మెఱుఁగ కభ్యసింప నేమిసిద్ధి.

108


వ.

అని చెప్పిన గిరీశునకు గిరిజ యిట్లనియె.

109


మ.

హరిమంత్రంబును దత్ప్రభావమును నే నాద్యంతము న్వింటి నిం
క రమాధీశుమహావిభూతులును [1]నాకారంబుఁ దద్వ్యూహముల్
పరమంబైన గుణంబులుం బరమ[2]ధామంబు ల్సమస్తంబు వి
స్తర[3]వాక్యంబుల నానతిమ్ము వరదా! చంద్రార్ధచూడామణీ!

110


క.

అన విని శంకరుఁ డిట్లను
విను నీ వడిగినవిధంబు విశ్వాత్ముని భూ
తినిరూఢి నెల్ల నా యెఱిఁ
గినగతి నెఱిఁగింతు నీకు గిరివరతనయా!

111


ఆ.

పరమపురుషుఁ డనఁగఁబడు నెవ్వఁ డతఁడు నా
రాయణుండు విష్ణుఁ డఖిలజగద
ధీశ్వరుండు పరమశాశ్వతుండు [4]వరుండు
విశ్వవిభుఁడు నాఁగ వెలయుచుండు.

112


సీ.

విశ్వస్వరూపియై వేయికన్నులు వేయి
      పాదంబులును గల్గి ప్రబలువాఁడు
భువనసంఘములకు బుధమానసములకుఁ
      దనమేను నిలుకడై తనరువాఁడు
పొడవుల కెల్లను పొడవు నడ్డంబునై
      యవ్యయంబగు రూపమైనవాఁడు
దివ్యమంగళమూర్తిఁ దివిరి శ్రీదేవికి
      నఖిలభోగాశ్రయమైనవాఁడు

  1. సాకారంబు (ము)
  2. ధర్మంబు (ము)
  3. నాక్యంబున (ము)
  4. జరుండు (ము)