పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200

పద్మపురాణము


ఆ.

రమ్యపీతనీలరక్తపాండుర లగు
మృత్తికలు ధరించు నుత్తములకుఁ
గడఁగి యర్థధర్మకామమోక్షంబులు
వరుసఁ గల్గునండ్రు పరమమునులు

93


వ.

అదియును వర్తులంబును నడ్డంబును ఛిద్రంబును [1]హ్రస్వం
బును నతిదీర్ఘంబును నతివిస్తరంబును వక్రంబును స్వరూపహీనం
బును నగ్రహీనంబును లూనమూలంబును నగు పుండ్రంబులు పరి
హరణీయంబులు గావున నాసికామూలంబున నుండి భ్రూమధ్యం
బునుంగా నుభయరేఖామధ్యం బంగుళీద్వయమాత్రంబును దద్రేఖ
లంగుళమాత్రంబులుంగా ధవళంబగు మృత్తిక ఫాలతలంబున
[2]నాసికాదికేశాంతంబు ఋజువుగా నూర్ధ్వపుండ్రం బిడవలయు.

94


చ.

అలికము గుక్షి వక్షమున నఱ్ఱున దక్షిణకుక్షినిన్ భుజ
స్థలమున మూఁపుమీఁద మఱిదావలిప్రక్కను [3]బాహుమూలముం
దలకొని మూఁపు వీఁపు కకుదంబుల నొప్పుగఁ గేశవాదులై
చెలువగు నామము ల్దలఁచి చెచ్చెరఁ బెట్టఁగ నొప్పు పుండ్రముల్.

95


వ.

తదనంతరంబ తదవశేషమృత్తికాప్రక్షాళనతోయంబులు మస్తకం
బున వాసుదేవనామంబుగా ధరియింపవలయు నయ్యైస్థలంబు
లం గేశవాదినామంబులం దన్మూర్తులం దలంచి యిడనగు నవి
యును లలాటంబున భుజంబుల వీఁపునఁ గంధరంబునఁ గంఠ
కూపంబునం జతురంగుళప్రమాణంబులును బాహుయుగంబున
నురంబున నష్టాంగుళంబులును నాయతంబులునుగా నూర్ధ్వపుం
డ్రంబులు వెట్టవలయుఁ దన్నామాంకితంబుల మధ్యంబుల
నెల్లను హరిద్రారేణువు ధరియించుట బ్రాహ్మణులకు నిత్యకర్త

  1. హ్రస్వదంబును (ము)
  2. నాసికాకేశాంతంబు (ము)
  3. బాహుమూలమం, దలపడ (ము)