పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

199


క.

ద్విజుఁ డూర్ధ్వపుండ్రవిధమున
రజనీరేణువు ధరింపఁ బ్రాఁతిగ విహగ
ధ్వజుఁ డందయుండుఁ దత్పద
భజనంబున నతఁడు వొందుఁ బరమపదంబున్.

90


సీ.

వేంకటభూధరవిమలమృద్ధరణంబు
         శ్రీపతిసాలోక్యసిద్ధిదంబు
ద్వారావతీపురవరమృత్తికాంకంబు
         రమణీయకామితార్థప్రదంబు
గంగానదీతీరకలితమృచ్చిహ్నంబు
         లాలితయాగఫలప్రదంబు
పీతచందనహేమభూతిధారణకృత్య
        మతిశయసర్వవశ్యప్రదంబు


ఆ.

కృష్ణమైన తులసిక్రింది మృత్తిక దాల్ప
సన్నుతాచ్యుత[1]ప్రసన్నకరము
గాన విష్ణుభక్తి నూని విప్రోత్తము
లూర్ధ్వపుండ్ర మిడుట యుత్తమంబు.

91


వ.

మఱియు దివ్యంబులగు హరిక్షేత్రంబులందును బర్వతాగ్రంబు
లందును బుణ్యనదీతీరంబులందును సముద్రజలాశయతీరంబు
లందును వల్మీకప్రదేశంబులందును విష్ణుస్థానోదకస్థలంబులం
దును శ్రీరంగాదివిశేషస్థానంబులందును దులసీవనంబులందునుం
గలమృత్తిక భక్తితోడం గొనివచ్చి నిత్యంబును విష్ణుపాదోదకం
బులం గరంగించి లలాటంబు మొదలైన యంగంబుల నూర్ధ్వ
పుండ్రం బిడువారలు విష్ణుసాయుజ్యంబు నొందుదురు మఱి
యును.

92
  1. సుప్రసన్నకరము (ము-గణభంగము)