పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

185


తే.

[1]ఆర్తుఁ డర్థార్థి జిజ్ఞాసు వాత్మవిదుఁడు
తగిలి యొకమాటు విను మదిఁ దలఁచిరేని
వారి కయ్యైఫలంబులు వరుస నిత్తు
నమ్మ నేర్చిర యేనియు నలినగర్భ!

21


వ.

దీక్షితుండు గానివానికి భక్తిహీనునకు మానరహితునకు నాస్తికు
నకుఁ గృతఘ్నునకు పరాఙ్ముఖునకు శీలవర్తనంబు లెఱుంగని
వానికి నిమ్మంత్రం బుపదేశింపవలవదు కామక్రోధలోభమోహ
దంభవర్జితుండై యాలస్యంబు విడిచి భక్తియోగంబున నన్ను
సేవించు పరమవైష్ణవునకు నీమంత్రం బుపదేశింపవలయు.

22


తే.

దీక్షఁ దొరకొనునప్పుడు దేశకాల
శుద్ధు లరిమిత్రగతులను [2]జూడవలదు
న్యాసముద్రాపునశ్చరణాదివిధులు
వలదు మద్భక్తి గలిగిన వనజగర్భ!

23


వ.

మదీయసుదర్శనధారణంబును మచ్చరణారాధనంబును సకల
ధర్మంబులు నాయందు సమర్పించుటయు ననన్యసాధనత్వంబును
అకించనుండై యవైష్ణవసంభాషణం బుడుగుటయు ననన్య
దర్శనమతవర్జనంబును అన్యదేవతాపూజనవందనాద్యుపచారానభి
ముఖత్వంబునుం బ్రపన్నుల కర్హంబులు. అట్లు గావున నీగుణం
బులుగల వారలకు నిమ్మంత్ర బుపదేశించుట కర్తవ్యంబు.

24


సీ.

రమణీయమగు మంత్రరత్నంబునకు ఋషి
        విను సనాతనుఁడైన విష్ణుఁ డనఘ!
సరసిజోదరుఁడు వాత్సల్యసాగరుఁడును
        సర్వలోకేశుఁడు శక్తియుతుఁడు

  1. తే. శాంతమానసుడై తన్ను సంతతమును
    తగిలి యెల్లప్పుడును మది దలచెనేని
    వారికెల్లను మోక్షము వరుసనిత్తు
    నమ్మ నేర్చిత యేనియు నలినగర్భ (హై)
  2. జూడవలయు (ము)