పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

పద్మపురాణము


వ.

తత్ప్రభావంబు వినుము మంత్రరత్నంబును ద్వయంబును
న్యాసంబును ప్రవత్తియు శరణాగతియు లక్ష్మీనారాయణంబు
సర్వఫలప్రదంబు హితంబు ననం బర్యాయనామంబులు గలిగి
యొప్పు నిమ్మంత్రంబు నుచ్చరించినం బరితుష్టహృదయుండ
నగుదు.

18


సీ.

ఆరూఢకులజాతుఁ డతులతపోనిధి
         వేదపారగుఁడును విపులయజ్ఞ
దానపరుండు తీర్థస్నానపూతుండు
         [1]వ్రతి సత్యసంధుండు యతివివేకి
సుజ్ఞాని యైనను శుభతరద్వయమంత్ర
         మధిగమింపండేని నతని విడువ
వలయు భూసురరాజవైశ్యశూద్రాన్వయ
        [2]జనములైన నితరజనములైన


ఆ.

[3]నాదు భక్తి గల్గి మోదిల్లిరేని నీ
మంత్రమునకు నర్హమతు లనన్య
గతు లనన్యశరణరతుల ననన్యసా
ధకులు దీని నెఱుఁగ దక్షు లనఘ!

19


ఆ.

ఆర్తులైనవారి కతిశీఘ్రఫలదమౌ
నొక్కమాటు మంత్ర ముచ్చరింప
[4]దృప్తజాతులైన దేహాంతరంబుల
వలన ముక్తు లగుదు రలఘుచరిత!

20
  1. వ్రతి (ము)
  2. ప్రవరులైనను నాదుభక్తి గలిగి (హై)
  3. మోదగిల్లిరేని ముఖ్యులు వార లీ (హై)
  4. దృప్తజంతులైన (హై)