పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

పద్మపురాణము

ద్వయమంత్రప్రభావము :

క.

ఏమంత్రము భవరుజలకుఁ
దా మందగు నవని మంత్రతతిఁ దలఁపంగా
నేమూర్తి దైవములలోఁ
దా మోక్షం బిచ్చుఁ బరమ[1]తత్త్వం బెందున్.

4


వ.

ఈయర్థం బంతయుఁ దేటపడ నెఱింగించి నన్నుఁ గృతార్థుం
జేయు మనిన నద్దిలీపునకు వసిష్ఠుం డిట్లనియె.

5


ఆ.

పరమమోక్షదంబు పరమరహస్యంబు
సర్వలోకహితము శాశ్వతంబు
నైన యర్థ మిప్పు డడిగితి నింతయు
వినుము చిత్తగించి మనుజనాథ!

6


ఆ.

[2]యజ్ఞదాననిరతు లగు శౌనకాదులు
ననఘ! నీవు నన్ను నడిగినట్లు
నలినభవతనూజు నారదు నడిగిన
నతఁడు వారితోడ ననియెఁ బ్రీతి.

7


క.

మునులార! వినుఁడు సెప్పెద
ననఘం బగు మంత్రమిది రహస్యము దీనిన్
సనకాదియోగివరులకు
వనజజుఁ డెఱిఁగించు తెఱఁగు వరుసను మీకున్.

8


వ.

ఎఱింగించెద నాకర్ణింపుండని శౌనకాదిమునులకు నారదుం
డిట్లనియె.

9


క.

ఒకనాఁ డేకాంతంబున
సకలాగమ[3]వేదులైన సనకాదులు మో
క్షకలనమంత్రం బీగతి
నకుటిలమతిఁ బద్మగర్భు నడిగిరి వేడ్కన్.

10
  1. ధర్మం (ము)
  2. అధికధర్మ (ము)
  3. మంత్రవిదులు (మ-తి-హై)