పద్మపురాణము
ఉత్తరఖండము - పంచమాశ్వాసము
క. |
శ్రీమత్కృపార్ద్రహృదయో
ద్దామ గుణాభరణ దానధర్మాచరణా
ధీమహిత సరసమానన
తామరసదినేశ కందదండాధీశా.
| 1
|
వ. |
పరమయోగవిద్యాగరిష్ఠుం డగు వసిష్ఠుండు దిలీపున కిట్లనియె
నీయడిగిన యర్థంబులన్నియు నితిహాసరూపంబున [1]వినిపించితి
నింక నేకథ విననిష్టంబు వేఁడుమనినఁ గరకమలంబులు మొగిడ్చి
యారాజకుంజరుండు మునివరాగ్రణి కిట్లనియె.
| 2
|
సీ. |
అనఘాత్మ! మీదయ నఖిలధర్మంబులు
విని మీరు [2]వినుపంగ విశదమైన
[3]జాతిధర్మములు నాశ్రమధర్మములు నిత్య
నైమిత్తకములు జన్నములు రాజ
ధర్మంబులును దీర్థదానవ్రతంబులు
మొదలుగా స్వర్భోగముల నొనర్చు
నట్టికృత్యములు పె క్కాచరించితి నింక
[4]నవ్యయంబగు మోక్షమందు నట్టి
|
|
ఆ. |
మార్గ మెఱుఁగ వేఁడి మద్భాగ్యవశమున
నీదు దివ్యచరణనీరజములు
గంటి వినఁగ నాకుఁ గౌతుకం బయ్యెడిఁ
దెలియఁ జెప్పు మిపుడు దివ్యచరిత.
| 3
|
- ↑ విన్నవించితి (ము)
- ↑ పనుపంగ (తి-హై)
- ↑ జాతిధర్మంబులు సర్వంబులును నిత్య (హై)
- ↑ నతిశయంబగు (ము)