పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

పద్మపురాణము


క.

[1]మేరుమహీధర మందర
ధీరగుణాభరణ! సతతధీనుతకీర్తి
శ్రీరమణ! సూరిమందిర
దారిద్ర్యతమఃప్రదీప! దర్పకరూపా!

195


మాలిని.

చతురగుణకలాపా! సౌమ్యసౌభాగ్యరూపా!
వితరణరవిపుత్త్రా! విప్రసంస్తోత్రపాత్రా!
మతివిజితసురేజ్యా! మాన్యలోకైకపూజ్యా!
యతులితగుణబృందా! యౌభళామాత్యకందా!

196


గద్య :

ఇది శ్రీనృసింహవరప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజగోత్ర
పవిత్ర యయ్యలామాత్యపుత్త్ర సరసగుణధుర్య సింగనార్య
ప్రణీతం బయిన పద్మపురాణోత్తరఖండంబునందు దేవద్యుతి
తపోమాహాత్మ్యంబును, పుండరీకాక్షుం డతనికిఁ బ్రత్యక్షం బగు
టయు, యోగసారస్తోత్రకథనంబును, వీరసేనుచరిత్రంబును,
కేరళవిప్ర[2]సంవాదంబును, మర్కటసారసకథనంబును,
ప్రయాగజలపానంబును, కేరళుండు ప్రేతత్వంబువలన విముక్తుం
డయి దివ్యలోకంబునకుం జనుటయు, మాఘస్నానంబున గంధర్వ
కన్యకలును మునికుమారుండును శాపవిముక్తులయి దివ్యశరీరం
బులు దాల్చుటయు, ప్రయాగతీర్థమహిమంబు నన్నది చతుర్థా
శ్వాసము


  1. మేరుధర మందరాచల, ధీరగుణాచరణ (ము)
  2. పథికు సంవాదంబును (తి-హై)