పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

179


వ.

వెండియు నమస్కారంబు చేసి కుశలం బడిగిన యనంతరంబ
దిలీపునకు మునికుంజరుం డి ట్లనియె.

190


సీ.

క్షేమంబె నీకు! విశిష్టధర్మంబులు
        జరుగునే నీదు రాష్ట్రంబునందు
వర్ణాశ్రమంబులు వరుసలు దప్పక
        వర్తించుచున్నవే వసుధనెల్ల
జనులును సంతతసంతుష్ట[1]చిత్తులే
        యధ్వరకృత్యంబు లవనిసురులు
చేయుదురే శత్రుశేషంబు ధాత్రిలో
        లేకుండ నరయుదే లోకు లెపుడు


తే.

నిన్నుఁ గొనియాడ వర్తింతె నెమ్మితోడ
రాజకృత్యంబులెల్ల సంరక్షితములె
యర్థ మార్జించుచో ధర్మ మరసి నీవు
నీతి తప్పక యేప్రొద్దు నెగడుదయ్య.

191


వ.

అనిన విని దిలీపుండు కృతాంజలియై మహాత్మా! నీప్రసాదం
బున నన్నియుం గుశలంబ భవద్దర్శనంబునఁ గృతార్థుండ నైతి
నని పలికి యమ్మహాముని వలన నత్యంతపుణ్యకథలు [2]విను
వేడ్క తన్ముఖకమలంబునం జూడ్కి నిలిపి.

192


క.

మునినాథ! నీ యనుగ్రహ
మున మాఘవిశేషమెల్ల మును విని నీ చె
చెప్పిన భంగి నాచరించితి
ననఘా! యిఁక నెద్ది కృత్యమని యడుగుటయున్.

193


తురంగవృత్తము.

సకలకవిజనవినుత! విలసితసౌమ్యకీర్తివిభూషణా!
ప్రకటవితరణవిభవ! సతతకృపారసాయతలోచనా!
వికచసరసిజసదృశవదన! నవీనకార్యవిశారదా!
సుకృతమయనయవినయగుణగణ! సూరిమానసరంజనా!

194
  1. చిత్తులై (ము)
  2. విని (ము)