పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

175


ఆ.

వేదనిధిసుతుండు విద్యాపయోనిధి
కల్మషంబు వాసి కాంతిఁ దనరె
మంచు దలఁగి పోవ మార్తాండబింబంబు
వెలుఁగు నట్లు భూపకులలలామ!

169


క.

తన పువ్వుఁదూఁపు లేనును
దనువులు ధరియించి చేరి తను గొలువంగాఁ
దనరిన మదనునికైవడి
మునితనయుఁడు నిలిచె నపుడు ముదము దలిర్పన్.

170


వ.

అపుడు వేదనిధి పుత్రుం గనుంగొని యశ్రుకణకలితనేత్రుండును,
కంటకితతనూరుహగాత్రుండును, గద్గదకంఠుండునునై యిట్ల
నియె.

171


క.

ఇన్నిదినంబులు నడవుల
[1]నిన్నీచపుఁదనువుఁ దాల్చి యిడుమలఁ బడఁగా
నిన్నుఁ గని పొక్కుచుండుదు
నన్నా! యిటు మరలఁ బుట్టితయ్య కుమారా!

172


క.

అని దివ్యరూపధరుఁడగు
తనయునిఁ దగఁ గౌఁగిలించి తల మూర్కొని యా
తనిఁ దగిలి వచ్చు లలనలఁ
గని రోమశమునికి ననియెఁ గౌతుక మెసఁగన్.

173


చ.

మునివర నీప్రభావమున మున్కొని శాపమహార్ణవంబు గ్ర
క్కునఁ దరియించి దొంటిగతిఁ గోమలరూపము లోలిఁ దాల్చి పెం
పెనయఁగ నున్న వీరలకు నెయ్యవి కృత్యము లానతిచ్చి నీ
పనిగొని ధన్యుఁ జేయుము శుభంబగు నీదగు పంపు చేసినన్.

174
  1. నన్నీచపుఁదనువుఁ దాల్చి నిడుమలఁ బడఁగా (ము-యతిభంగము)