పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

173


ఆ.

అమరలోక[1]హీనయై వచ్చి యూర్వశి
యిచటఁ దనువుఁ [2]దోఁచి యెలమితోడఁ
బుణ్యలోకమునకుఁ బోయె[3]నిర్దోషయై
మహితపుణ్యతీర్థమహిమఁ జేసి.

161


సీ.

మహిఁ బుత్రకాముఁడై నహుషాఖ్యుఁ డీతీర్థ
        మాడి సత్పుత్త్రు యయాతిఁ గాంచె
ధనకాంక్షియై యక్షుఁ డనుపమం బైన యీ
       నదిఁ గ్రుంకి నవ[4]నిధానములు గనియె
[5]మాయాబలంబును నాయతంబుగ నొందె
       నారాయణుఁడు దొల్లి; నరుఁడు గూడ
[6]నశనంబు గుడువక యైదువత్సరము లిం
       దుండి మహాబలయుక్తుఁ డయ్యెఁ


తే.

గశ్యపుఁడు దొల్లి తాను శంకరునిఁ [7]గూర్చి
తపము గావించె నా భరద్వాజుఁ డిందు
రూఢి వర్తించి క్షేత్రజ్ఞురూప మొందె
ననఘ! యిన్నదిఁ గొనియాడ నలవి యగునె.

162


వ.

మఱియు సనకాదియోగీంద్రులు నీతీర్థస్నానఫలంబునం జేసి
యోగసిద్దులు వడసి రిందు మాఘమాసస్నానంబు జేయువారలు
నక్షత్రరూపంబులై దివంబున వెలుఁగుదు రిందు మోక్షార్థులకు

  1. హీనుడై యున్న యింద్రుడు (మ)
  2. దొలచి (తి)
  3. నిర్దోషియై (మ)
  4. నిధానంబు లోలి (ము)
  5. మాయాబలంబున నాయతంబుగ నొందె, నారాయణుఁడు దొల్లి నరుని గూడి (ము)
  6. యశనంబు గుడువగ (ము)
  7. గొల్చి (ము)