పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

171


తే.

అట్లు గావున నిక్కన్నియలు నితండు
నీవు నేనుఁ బ్రయాగకుఁ బోవవలయు
నచట సుస్నాతులై రేని నా క్షణంబ
వీరి శాపంబు లన్నియు విడిచిపోవు.

154


క.

నిజ[1]పుణ్య[2]మూర్తి తనువులు
భజియింతురు తత్ప్రయాగభాసురసుస్నా
నజమగు పుణ్యఫలంబున
నజహరులకు సేవనీయ మన్నది యనఘా!

155


క.

అని రోమశముని చెప్పిన
వినుతకథామృతరసంబు వీనులనిండన్
దనివి సనఁ గ్రోలి పాతక
వనరాశిఁ దరించునట్టి వాంఛ యెలర్పన్.

156

వేదనిధి పుత్త్రుని గంధర్వకన్యలను రోమశుండు ప్రయాగస్నానంబునఁ బునీతులం జేయుట :

వ.

అప్పుడు వేదనిధి యక్కన్నియలం దన పుత్త్రుని నచ్చోటఁ
దీర్థస్నానంబు [3]సేయింప రోమశసహితుండై గగనగమనంబు
నం బ్రయాగకుం జనుదెంచినఁ దత్తీరంబున నిల్చి పుణ్యస్థలం
బులు చూపుచు రోమశుండు వేదనిధి కిట్లనియె.

157


సీ.

ఈ వేదిమీఁద వాణీశుండు యజమానుఁ
        డై తొల్లి యాగంబుఁ బ్రీతిఁ జేసి
కరితుండసన్నిభాఖండాజ్యధారచే
        విప్రు లేప్రొద్దును వేల్చుచుండ

  1. పూర్వ (తి-హై)
  2. మూర్తు లిరువురు (తి)
  3. సేయించి (ము)