పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

పద్మపురాణము


వ.

అని చెప్పి కేరళుండు పథికున కిట్లనియె. నయ్యా నాకుఁ బరమ
పావనంబగు జాహ్నవీజలం బొసంగి పిశాచత్వంబువలన నుద్ధ
రించితివి గావున భవదీయచిత్తంబున ధర్మంబు వదలక చిర
కాలంబు సుఖియింపుమని దీవించి దివ్యవిమానారూఢుండయి
దివంబున కరిగె. విప్రుండునుం దన మనంబున నచ్చెరువందుచు
మరలి ప్రయాగకుం జని సుస్నాతుండయి తజ్జలంబులు గొని
వచ్చి తన పితరుల కిచ్చి వారల సంతుష్టులం జేసి సుఖంబుండె.

150


సీ.

అని యిట్లు గంగామహత్త్వంబు ద్రావిడ
        పతికి దేవద్యుతి యతిశయముగఁ
జెప్పిన విని యాతఁ డప్పుణ్యమూర్తికిఁ
        బ్రణమిల్లి వీడ్కొని భక్తితోడఁ
దగఁ బ్రయాగకు నేగి తజ్జలస్నాతుఁడై
       కల్మషపంకంబు గడిగిపుచ్చి
విను పిశాచత్వంబు విడిచి దివ్యాంగుఁడై
       మానితదివ్యవిమాన మెక్కి


తే.

సిద్ధగంధర్వకన్యలు చేరి కొలువ
దివ్యగానంబు లులియంగఁ దేజరిలుచు
నధికపుణ్యాత్ములకుఁ గాని యందరాని
దేవలోకంబునందు సుస్థితి వహించె.

151


వ.

అని చెప్పి మఱియును రోమశుం డిట్లనియె.

152


క.

ఈ యాఖ్యానము వినినను
[1]నాయుశ్శ్రీకీర్తు లొదవి యనివారణమై
శ్రేయోయుతులై [2]సుఖదో
పాయంబున మోక్షసిద్ధిఁ బడయుదు రెపుడున్.

153
  1. నాయువు శ్రీకీర్తు లొదవు నఘహరణంబై (తి-హై)
  2. సుకరో (మ-తి)