పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

పద్మపురాణము


నాకుం బిపాసాపహరణంబై తజ్జలప్రభావంబునం బిశాచత్వం
బుడుగు నని పలికి మఱియు నొక్కకథ చెప్పెద నాకర్ణింపుమని
యిట్లనియె.

129


సీ.

పారియాత్రమునందు బ్రాహ్మణుం డొక్కఁడు
         గ్రామ[1]యాజకుఁడు ధరామరేంద్ర!
[2]యాతతసంపూర్ణయాచకత్వంబున
         బ్రహ్మరాక్షసశరీరంబు దాల్చి
యివ్వింధ్యగిరి నుండ నేను నాతండును
         గూడి దుఃఖంబులు గుడుచుచుండ
నాతనినందనుఁ డతిభక్తి జాహ్నవి
        కరిగి సుస్నాతుఁడై యతఁడు తండ్రి


తే.

యస్థి యన్నదిఁ బెట్టిన యంతఁజేసి
ధన్యుఁడై బ్రహ్మరాక్షసతనువు విడిచి
మహితభాగీరథీతోయమహిమఁ జేసి
యేను జూడంగ నవ్విప్రుఁ డేగె దివికి.

130


వ.

అట్లు గావునం బ్రత్యక్షప్రభావంబులగు గంగాజలంబులు వోసి
న న్ననుగ్రహింపుము.

131


మ.

ప్రతితీర్థంబున[3]దానసంగ్రహముచేఁ బాపంబునుం గొట్టి త
త్ప్రతికారంబులుగాఁ దపో[4]నియమతీర్థస్నానముల్ భక్తి సు
స్థితిఁ [5]గావింపక యీపిశాచతనువుం జేకొంటి నట్లౌట నా
కతిదూరీకృతతోయ [6]భూజనుఁడనై యా పోవకే నీ యెడన్.

132
  1. యాచకుడు (హై)
  2. యాతడు (హై)
  3. దుష్ప్రతిగ్రహముచే (మ-తి-హై)
  4. నియతి (మ-తి-హై)
  5. గావింపమి నిప్పిశాచ (మ-తి-హై)
  6. భోజనుడనై (తి)