పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

167


వ.

ఇట్టి దురవస్థ లనుభవించుచు ముప్పదివేలేండ్లు [1]గోలె నున్న
వాఁడ నా తెఱంగెల్ల దాఁచక చెప్పితి జలదానంబు చేసి ప్రాణంబు
గావు మే దానంబులుం బ్రాణదానంబునకు [2]సరిగా వనిన పథి
కుండు కరుణాయత్తచిత్తుండై తన మనంబున.

133


క.

న్యాయార్జితవిత్తంబులు
పాయక సత్పాత్రమునను బహుదానంబుల్
సేయుచు సుఖులగు ధన్యుల
కాయతమతి నిహపరంబు లఱచేతివగున్.

134


వ.

మఱియు నుభయలోకజిగీషులగువారు గోభూహిరణ్యరత్న
ధాన్యగృహమాల్యంబులును, రథాశ్వవస్త్రవారణంబులును, సం
పూర్ణాన్నఫలజలంబులును, ఛత్రచామరాందోళికావ్యజనోపానత్త
ల్పకాసనవారాంగనా[3]మహిష్యాదులును, కన్యామంత్రవిద్యా
[4]వనంబులును, గంధకర్పూరతాంబూలంబులును దానంబు
లొసంగి యక్షయభోగలోకసౌఖ్యంబు లనుభవింతురు.

135


క.

ఆరోగ్యాయుశ్శ్రీవి
ద్యారూఢులు దానఫలములని పురుషుఁడు పెం
పార నిడవలయుఁ జేయని
వారికి లే కునికి తథ్యవాక్యం బగుటన్.

136


వ.

అని విచారించుచున్న పథికునకు పిశాచం బిట్లనియె.

137


సీ.

జలదంబు దెసఁ జూచు చాతకం బెట్లట్ల
         ని న్నాసపడి చూచుచున్నచోటఁ
బ్రాణరక్షణయెడ బ్రాహ్మణోత్తమ! నీవు
         తడయకు మనుడు నాతఁడు మనమున

  1. వోలె (ము)
  2. సరిగావని పలికిన విని (తి-హై)
  3. మహిషాదులును (హై)
  4. ధనంబులును (మ-తి-హై)