పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

165


క.

ఇత్తెఱఁ గెఱిఁగియు నిశ్చల
చిత్తులు దుర్దశలచేతఁ జిక్కరు వివిధా
యత్తులు కార్యవివేకగు
ణోత్తరులై యునికిఁ జేసి యుత్తమచరితా!

124


వ.

అట్లగుటం జేసి నీవునుం గాలంబు వేచుకొనియుండు మేను నీ
వనంబున జన్మంబు గడపెద ననిన సారసంబునకు వానరం బి
ట్లనియె.

125


తే.

సారసోత్తమ! నీవు సుజ్ఞానబుద్దిఁ
దెలిసి నా పూర్వభవమెల్లఁ దెలియఁ జెప్పి
తట్లు గావున నా దుఃఖ మణఁగె [1]నీవు
[2]నింతియును నిచ్చ భోగింపుఁ డెలమితోడ.

126


వ.

అని దీవించి వానరంబును సారసంబును నిజేచ్ఛం జనియె నట్టి
యెడ.

127


తే.

ఇట్లు తమలోనఁ బలుకు కపీశపక్షి
పుణ్యసంవాదమే [3]విని బోధపుట్టి
విగతశోకుఁడ నైతి నో విప్రవర్య!
యమ్మహానదితటమున నప్పు డునికి.

128


వ.

అని చెప్పి పిశాచంబు పథికున కిట్లనియె. నయ్యా! నా కంత
కంతకుం దప్పి గదిరెడు నీచేతి జాహ్నవీజలపానంబునం జేసి

  1. నిచట (తి-హై)
  2. నీవు నింతియు భోగింపు నెమ్మితోడ (తి-హై)
  3. వినబోధ పుట్టె (ము)