పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

పద్మపురాణము


చుండ నొక్కముహూర్తంబు కల్పశతంబై తోఁచునట్టివేదనం బడి
ముప్పదివేలేం డ్లానరకం బనుభవించి దైవాధీనంబున నచ్చోటు
వెలువడి సారసంబనై జన్మించితిఁ దన్మూలంబు చెప్పెద నాకర్ణిం
పుము.

119


క.

చెలియలిగృహమున కంచము
[1]గలుషంబున నపహరించి గర్వంబున నా
చెలికాని కిడితి నాయమ
యలమటఁ ద్రెక్కొనఁగఁ బక్షి నైతి[2]నరేంద్రా !

120


క.

ఇది నాదు భార్య మును నీ
సదనంబునఁ బళ్లెరంబు చౌర్యంబున ను
న్మదవృత్తిఁ గొనిన దోషము
గదిరిన నిటఁ బుట్టి నన్నుఁ గదిసి చరించున్.

121


వ.

అని యిరువుర జన్మప్రకారంబునుం జెప్పి సారసంబు భావివృత్తాం
తంబు వినిపింపం దలంచి యిట్లనియె. నరేంద్రా! మన మిరువు
రము నీ యింతియును రాయంచలమై పుట్టి యటమీఁదఁ గామ
రూప[3]దేశంబునఁ [4]గుయోనులం జన్మించి మఱియును
మనుష్యులమై జన్మింపఁగలవారమని మఱియు నిట్లనియె.

122


క.

తన తన పుణ్యము పాపము
ననుగతమై తోడునీడ యట్లై వెంటన్
జనుదేరఁగ సుఖదుఃఖము
లనుభవయోగ్యములు నరుల కవి[5]యెవ్వరికిన్.

123
  1. కలుషంబన కపహరించి (తి-హై)
  2. ఁగపీంద్రా (ము)
  3. దేహంబున (ము)
  4. తిర్యగ్యోనులం జనించి (మ)
  5. యెన్నటికిన్ (హై), యెప్పటికిన్ (తి)
    ఇచ్చటగల యధికపాఠము
    క. సుర నర కీటాది కళే
    బరములు ధరియించి పుణ్యపాపంబులఁ జె
    చ్చెర ననుభవించు జీవుఁడు
    పరువడి విధి నియతిఁ గడవఁబడ దెవ్వరికిన్ (తి-హై)