పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

163


ఆ.

పూర్వజన్మకర్మమున విహితంబులౌ
తమ శుభాశుభములు తరుచరేంద్ర!
యనుభవింపవలయు నమరులకైనను
[1]దలఁగఁద్రోచుకొనఁగ నలవిగాదు.

115


వ.

అనిన విని ప్లవంగంబు విహంగంబున కిట్లనియె.

116


చ.

ఎఱుఁగుదు తథ్యమింతయు మహీసురవర్య! మతిప్రకాశతన్
గఱదలు మాని చెప్పుము ఖగత్వము నేమి నిమిత్త మొంది తీ
వెఱిఁగినచంద మె ట్లనుచు నేర్పడ వేఁడిన సారసాఢ్యుఁ డ
త్తెఱఁ గెఱిఁగించె వీనులకుఁ దియ్యమెలర్ప ననూనపద్ధతిన్.

117


సీ.

నర్మదాతటమున నర్మిలి నీ వొక
         నలినమిత్రగ్రహణంబునాఁడు
ధారుణీసురులకు దానంబు లిడుమని
         నెమ్మి నాచేతికి నిష్కశతక
మిచ్చిన నేఁ బురోహితుఁడనై చనవున
         మదమునఁ జేసి ధర్మంబు దప్పి
యమ్మహీసురులకు నల్పధనం బిచ్చి
         యంతయుఁ గైకొంటిఁ జింతలేక


ఆ.

యిట్లు [2]బ్రహ్మవిత్తమెల్ల విచ్ఛేదించి
పుచ్చుకొనిన యట్టి భూరిపాత
కమునఁ జేసి వడితి కాలసూత్రంబున
నందులోని దుఃఖ మవధరింపు.

118


వ.

రక్తపల్వలంబును దుర్గంధపూయఫేనంబును క్రిమిసంకులంబు
నగు నతిఘోరనరకంబున నధోముఖుండనై నాభీపర్యంతంబు
మునింగి నిరుచ్ఛ్వాసుండనై క్రిములు దొలుచుచుండ నూర్ధ్వ
భాగంబు తీవ్రతుండంబులగు గృధ్రవాయసంబులు పొడుచు

  1. దొలఁగద్రోచుకొనఁగఁ దరముకాదు (ము-యతిభంగము)
  2. బ్రాహ్మణధన మేను విశేషించి (హై)