పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

పద్మపురాణము


వ.

అని చెప్పి యప్పిశాచంబు మఱియు నిట్లనియె. నాతొంటిజన్మ
ప్రకారంబు దలంచుకొని దుఃఖితుండనై తిరుగుచుండి యొక్కనాఁ
డొక్కనదీతీరంబున నొక్కసారసవాక్యంబు [1]వింటి నాట
నుండియుం గొంత యూఱడిల్లి యున్నవాఁడ నని చెప్పిన విని
విప్రుం డవ్విధం బెఱింగింపు మనిన నతం డిట్లనియె.

101


చ.

వినుము మహీసురప్రవర! వింధ్యనగంబున [2]మూహరాఖ్యమై
చను నొకయేఱు పక్షిమృగసంఘముకెల్లను బ్రాణహేతువై
యనుపమకూలవృక్ష లతికాంచితపుష్పపరాగపుంజఫే
ననిచయరమ్యమై మునిమనఃప్రమదం బొనరించు నెప్పుడున్.

102


క.

ఆ తటినీతటమున న
త్యాతురమతిఁ దిరిగి తిరిగి యలయికమై నే
నేతెంచుచుండ నచటికి
శీతలజల మానునట్టి చిత్తముతోడన్.

103


వ.

ఒక్కసారసమిథునం [3]బయ్యేటిలోనికిం దిగి జలం బాని విగత
పరిశ్రాంతంబై యప్పులినతలంబున.

104


క.

సురతశ్రమమున బెగ్గురు
లిరవుగ నొకటొకటిఁ గదిసి యిమ్ముల వామ
స్ఫురదురుపక్షాంతరముల
[4]నురములు శిరములును జేర్చి యొగి నిద్రించెన్.

105


క.

అప్పుడు వానర మొక్కఁడు
చప్పుడు గాకుండ నల్లఁ జని సౌఖ్యమునం
దెప్పిరి నిద్రలు వోయెడి
యప్పులుఁగులఁ బట్టుకొనియె నతినిష్ఠురతన్.

106
  1. విని (తి-హై)
  2. మూహకాఖ్యమై (మ), బాహుదాఖ్యయై (హై)
  3. బచ్చటికి వచ్చి యయ్యేటి (హై)
  4. శిరములు గర మణచి యోరసిలి నిద్రించెన్ (హై)