పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

161


వ.

ఇట్లు పట్టువడిన విహంగం బగచరంబున కిట్లనియె.

107


క.

ఓ యన్న వానరోత్తమ!
యే యపరాధమును జేయ [1]మెన్నఁడు నీకున్
[2]మాయట్టివారిఁ బొడగని
యీయెడ నీ కుచిత మగునె యిటు రోషింపన్.

108


సీ.

పరవృత్తివిముఖుల సరసాంబుశైవాల
        భక్షులఁ బరదారపరిహరణుల
నిజదారనిరతుల నిర్మలచరితుల
        దుర్జనసంసర్గదూరమతుల
పరివారశూన్యుల పరిజనసేవావి
        హీనుల నత్యంతహితులగుణుల
నొరుల వేఁడనివారి నుత్తమద్విజులగు
       మముబోంట్లఁ గని కృప మాననేల?


ఆ.

నిరపరాధిఁ గాన నీ కెఱింగించితి
నన్ను [3]విడువుమయ్య నగచరేంద్ర!
నీదు జన్మమెల్ల నిజముగా నెఱుఁగుదు
తెలియ[4]వలసితేనిఁ దేటపఱతు

109


చ.

అనవుడు బెగ్గురు న్విడిచి యక్కపి యచ్చెరువంది చూచి యి
ట్లనియె మహాత్మ! నీవు మది నారయఁ బక్షివి బోధహీనతన్
వనమున సంచరిం తెఱుకవచ్చిన కారణమేమి నా పురా
తనజననంబు నీ వెటులు తప్పక కాంచితి నాకుఁ జెప్పుమా!

110
  1. నెన్నడు (హై)
  2. నాయట్టివాని (హై)
  3. విడువవయ్య (ము)
  4. వలసెనేని (ము)