పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

159


ఆ.

కన్ను గాలులేని కష్టచరిత్రులు
నడిగి కుడుచువారు ననద లగుచు
ధర నపుంసకులును దైవకృతంబున
వగల నొగులఁ గానవచ్చుఁ గాదె!

95


ఆ.

దానవంతులైన ధన్యులఁ దత్ఫలం
బెన్నిగతులఁ బొందు నెచటనున్న
నొల్ల మనిన మాన దుఱక పాపాత్ములఁ
గీడునట్ల పొందుఁ [1]గీడుపఱచి.

96


వ.

అట్లు గాన నిగ్గిరియం దనేకబ్రహ్మరాక్షసపిశాచంబులు దిరుగు
చుండు వానికి నొక్కొక్కయెడం గ్రాసంబు గలుగుంగాని పాపా
త్ముండనైన నాకు నాహారంబు సంభవించనేరదని చెప్పి యప్పిశా
చంబు వెండియు ని ట్లనియె.

97


ఆ.

నీవు వెఱవవలదు నిఖిలభూతప్రేత
తతులవలన నిచట ధర్మచరిత!
విష్ణుభక్తి కలిమి వెలసిన నీ దిక్కుఁ
దేఱిచూడ వెఱచు నూఱడిల్లు.

98


వ.

మఱియును భూతప్రేతపిశాచరాక్షసయక్షగంధర్వకృత్యా
కూశ్మాండవినాయకాదిగ్రహంబులు విష్ణుభక్తుండును శుచియు
నగు బ్రాహ్మణునిం గని దూరంబునఁ దొలంగిపోవు గ్రహనక్షత్ర
దేవత లతని రక్షింతు రట్లు గావున.

99


క.

హరినామము నీనాలుకఁ
దిరముగ వర్తించు వేదతీర్థమయుఁడ వీ
వరయఁగ నటు గావున సు
స్థిరమతి వర్తించు మిచట ధీరవిచారా!

100
  1. గీడ్వరించి (ము), గీడ్పరించి (మ-తి)