పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

పద్మపురాణము


పారాకచాంద్రాయణంబులు సలుపమియుం జేసి పూర్వజన్మంబు
[1]నిరర్థకం బగుట నిట్టి యంధమతిం బొంది పాపంబు [2]ననుభ
వించుచున్నవాఁడ నట్లుం గాక.

90


క.

నిండిన చెఱువులుఁ గొలఁకులు
బండిన తరువులునుఁ బెక్కుపక్షులుగల వీ
కొండ నది నాదు చూడ్కికి
నెండినగతి [3]దోఁచుఁ బాప మేమని చెప్పన్.

91


ఆ.

గాలి ద్రావు పాముకైవడి బ్రతుకుచు
నున్నవాఁడ భూతయోనిఁ బుట్టి
పెద్దకాలమయ్యె పెంపేది యీ పాప
మనుభవించుచుంటి ననఘచరిత!

92


తే.

బ్రతుకు సుఖదుఃఖములును[4]లాభం బలాభ
మును నసౌఖ్యంబు మరణంబు భోగయోగ
ములు వియోగంబుఁ బుడమిలోఁ బుణ్యచరిత!
దైవహేతువులై యుండుఁ దరతరంబ.

93


ఆ.

దైవ మిచ్చెనేనిఁ దలఁపఁ గురూపులు
[5]ననఁగ బధిరమూకులైనవారు
నింద్యవర్తనులును నిర్గతశౌర్యులు
నధికులై చరింతు రనఘచరిత!

94
  1. నిరర్థకంబై పోవుట యధర్మగతి బొంది (హై), యధమగతి బొంది (మ)
  2. ప్రాప్తంబై యనుభవించు (హై)
  3. నుండు (తి-హై)
  4. లాభములు సౌఖ్య, ములును మరణంబు లంకెలు భోగయోగ (తి)
  5. నకులజులును మూర్ఖులైనవారు (మ-తి-హై)