పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

157


వ.

అట్లుంగాక ఫలపుష్పభరితతరువనంబులును, నిర్మలజలపూర్ణ
తటాకంబులునుం బెక్కులు గల యిప్పర్వతంబున నుండి క్షుత్పి
పాసల నింత డయ్య నేల యని యడిగిన నప్పిశాచం బతని
కిట్లనియె.

87


ఊ.

కేరళదేశభూసురుఁడఁ గేవల లోభి నదత్తదానవి
స్ఫారుఁడ ధర్మహీనుఁడ గృపారహితుండఁ బరాన్నభక్షణో
దారుఁడ బాతకాఢ్యుఁడను దారుణవర్తనుఁడ న్మహోగ్రహిం
సారసికాంతరంగుఁడ నసంగతవాక్యుఁడ భక్తిహీనుఁడన్.

88


తే.

బిచ్చమేనియు నొరులకుఁ బెట్టియెఱుఁగ
వినుము గలలోననైనను [1]వేల్పుఁ గాన
దీనులగువారిఁ బోషించు తెఱఁగుఁ దలఁప
నెన్నఁడును దేవతాసేవ యెఱుఁగ నేను.

89


వ.

మఱియు జలపాత్ర తిలపాత్ర తాంబూలంబులు వర్షాతపనివార
ణంబులగు ఛత్రోపానద్ద్రవ్యంబులు నొసంగమియు, నతిథిసత్కా
రంబులు సేయమియు, అంధవృద్ధబాలదీనానాథులం బోషింప
మియు, [2]గోగ్రాసం బిడమియు, వ్యతీపాతసంక్రమణారుణోప
రాగంబులను యుగాదిమన్వంతరతిథులయందును బైతృకంబు
సేయమియు, కార్తికంబున దీపంబు పెట్టమియు, మాఘస్నాన
తులసీతీర్థంబునకై యగ్ని ప్రజ్వలింపంజేయమియు, జెఱలు విడి
పింపమియు, శరణు వొందినవారి రక్షింపమియు, విష్ణుదేవునిం
పూజింపమియు, నిదాఘకాలంబుల శీతజలంబులు వోయమియు,
అశ్వత్థవటాదివృక్షంబు లారోపింపమియు, కృచ్ర్ఛాతికృచ్ర్ఛ

  1. వినుతి యెరుగ (హై), వేల్వగాన (మ-తి)
  2. గోగ్రాసం బిడక భృత్యవర్గంబును నిగ్రహించుటయు (హై) అతిథిసత్కారంబును ఉసిరికాయల తీర్థదానంబు సేయకయు (హై-అధికపాఠము)