పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

పద్మపురాణము


వ.

ఇట్లు కేరళవిప్రుండు దహనాదిపారలౌకికక్రియారహితత్వంబు
నం బ్రేతంబై తిరుగుచు నిర్జనంబగు వింధ్యగిరిగహ్వరంబున
వసియించి దిగంబరుండును, శుష్కశరీరుండును, శీతాతప
[1]క్లిష్టుండును, జలాన్నవివర్జితుండునునై శరణంబులేక దుఃఖి
తుండై తిరుగుచుండెనని చెప్పి విప్రుండు పిశాచంబునకు వెండియు
నిట్లనియె.

75


ఆ.

ఏమియైన దాన మిడనివారికిఁ దమ
కర్మఫలము లొందుఁ గాలగతులఁ
గడపరాదు గాన కర్మంబు గుడువక
తీఱ నేర దెట్టివారికైన.

76


వ.

అది యెట్లనిన

77


సీ.

అగ్నిముఖంబున నలమి వేల్వనివారు
        హరిపూజ సేయని యట్టివారు
నాత్మవిద్యాహీను లగువారుఁ[2]గుహకులుఁ
        బరపీడకులును [3]బాపవ్యసనులు
బాలవృద్ధార్తవిప్రస్త్రీల యందుల
        దయలేనివారును [4]దహనవిధులుఁ
గూటసాక్షులుఁ గాలకూటదాయకులును
        గ్రామయాజకులును గంటకులును

  1. ఖిన్నుండును (హై)
  2. కుమతులు (హై)
  3. డంబప్రవృత్తు
            లగువారు బాలవృద్ధార్త విప్రస్త్రీల (మ-హై)
    లగువార లశనంబు లమ్మెడువారును
    అవనిలో మరియు పరాన్నభక్షు
    లగువారు లుబ్ధులు నతిపాపకర్ములు
    స్వామిపరిత్యాగభూమిహర్త
    కులును గురుదేవతాదూషకులును పుణ్య
    క్షేత్రహర్తలు యతినింద చేయువారు
    జననిజనకుల బ్రోవని జడులు తుచ్ఛహీనజాతులలో వసియింతు రెపుడు (తి)
  4. తామసులును (హై)