పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

153


క.

శరదాగమమున మలినతఁ
బొరయక వెలుఁగొందు చంద్రుపోలిక వేణీ
సరిదంబు మజ్జనంబున
నరుఁ డఘములఁ బాసి పొందు నాకసుఖంబున్.

71


తే.

తజ్జలస్పర్శమాత్రాన ధరణిఁ దొల్లి
కేరళద్విజుఁ డఘముల గీటణంచి
ముక్తుఁడై పోయెఁ గావున మొగిఁ బ్రయాగ
మహిమ వాక్రుచ్చి చెప్ప బ్రహ్మకు వశంబె!

72


వ.

అనిన విని పిశాచంబు తనుతాపంబు నశియించి సంతుష్టాంతరం
గంబై మునీంద్రా! కేరళవిప్రుం డెవ్విధంబునఁ బాపవిముక్తుం
డై దివ్యలోకంబు ప్రాపించెనని యడిగిన నతనికి దేవద్యుతి యి
ట్లనియె.

73

కేరళబ్రాహ్మణుని కథ దేవద్యుతి పిశాచంబునకుఁ జెప్పుట :

సీ.

కేరళదేశీయుఁ డారూఢవేదపా
        రగుఁడు ధనాఢ్యతారాజితుండు
కలఁడు విప్రుఁడు వాని కలధనంబంతయుఁ
       బోరి దాయాదులు పుచ్చుకొనిన
నిర్ధనుండై బంధునికరంబు నెడఁబాసి
       వడి జన్మదేశంబు విడిచిపోయి
పరదేశములవెంటఁ దిరుగుచు నొక్కఁడు
       నధికచాపలమున నడవి చొచ్చి


తే.

తీర్థమున కేగుచును డస్సి[1]తెవులు వట్టి
ఘనబుభుక్షార్తుఁడై వింధ్యకాననమున
నరయు వారలు లేక కూ డబ్బ కునికిఁ
జచ్చె నట్టిట్టు వోలేక ముచ్చ ముణిఁగి.

74
  1. తెరవు దప్పి (హై)