పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

పద్మపురాణము


తే.

నెవ్వఁడవు నీవు[1]నీకేడ్వ నేల యిట్టి
దుఃఖకారణమేమి యీ దుష్టజన్మ
మెట్లు ప్రాపించె నింతయు నెఱుఁగఁ జెప్పు
నాకు వగవయ్యె నినుఁ జూచి భీకరాంగ!

58


చ.

అనుడుఁ బిశాచ మిట్లనియె నమ్మునివాక్యము లాలకించి తా
వినయకృతోత్తమాంగమయి వేగమె రోదనమెల్ల మాని సం
జనితమనఃప్రమోదరససాగర ముబ్బుచు నిట్టగ్రమ్మఁగా
ననుపమసత్వసంగతనయాన్వితవాక్యవిశేషపద్ధతిన్.

59


వ.

అయ్యా! భవద్దర్శనంబున నాచిత్తంబు సంతసంబందె మేఘంబు
చేత శైలదావదహనతాపం బాఱినట్టు లమృతసమానంబులగు
నీ వాక్యంబుల నా శరీరతాపం బణంగె నని యమ్మునీంద్రునికి
నమస్కరించి తన పూర్వజన్మప్రకారంబుఁ జెప్పి మఱియు
నిట్లనియె.

60


క.

ఎవ్వని నామము పేర్కొని
మవ్వంబగు పుణ్యలోక[2]మందు నరుం డే
నవ్విష్ణుని దూషించిన
క్రొవ్వున దుర్గతులయందుఁ గూలితిఁ బెలుచన్.

61


తే.

[3]అఖిలజగముల ధర్మంబు లరయు నెవ్వఁ
డొసఁగుఁ గర్మఫలంబుల నోపి యెవ్వఁ
డట్టి విష్ణుని[4]తో వైర మావహించి
యధికదుఃఖంబుఁ బొందెద ననఘచరిత!

62
  1. నీ కిప్పు డేడ్వనేల (తి-హై)
  2. మహితుడగు నరుం, డవ్విష్ణుని(మ-తి-హై)
  3. పంచభూతాత్మకంబయి పరగుచున్న, యఖిలజగముల ధర్మంబు లరయు నెవ్వ, డట్టి (తి)
  4. తేజంబు నపనయించి, నట్టి దుఃఖంబు (ము)