పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

149


క.

మిట మిటని యెండ గాయఁగఁ
దట తట మని గుండె లదరఁ దల్లడపడియాఁ
కటఁ గటకటఁ బడి తిరుగుచు
నిట నటఁ జూచుచుఁ బిశాచ మెంతయు వగలన్.

54


వ.

ఆక్రందనంబు సేయుచు వచ్చి వచ్చి యక్షప్రస్రవణారణ్యంబు
ప్రవేశించి యం దొక్కతాడిమ్రానినీడ నిలిచి యంగలార్చుచుఁ
దనలోన నక్కటా యట్లు సర్వభూతద్రోహసంచారంబున వర్తిం
చిన నాకు నిట్టి దురవస్థ వాటిల్లె నిం కెవ్వరు ది క్కేమి గతిం జరి
యింతు నీ యాఁకటి కేమి సేయుదునని యున్నంత.

55

పిశాచరూపంబున దుఃఖించుచున్న చిత్రసేనుని దేవద్యుతి యనుగ్రహించుట :

క.

విని యా దేవద్యుతి త
[1]న్నినాదజాతాద్భుతంబు నిర్భరమై నె
మ్మనమున నిండఁగ నచటికిఁ
జని యేడ్చుచు నున్న యప్పిశాచముఁ గనియెన్.

56


వ.

కని డాయంజని.

57


సీ.

క్రూరాననంబును గుఱుచవెండ్రుకలును
        బింగాళాక్షులును నుత్తంగనీల
తనువును నతిదీర్ఘతరపాదజంఘలు
        నంటుఁబ్రక్కలును సర్వాంగకములఁ
బొడచూపునరములుఁ గడుభీకరంబగు
       నప్పిశాచముఁ జూచి యాత్మలోనఁ
గరుణయు దుఃఖంబు బెరయ నమ్మునినాథుఁ
       డల్లన నిట్లను నతనితోడ

  1. నినదము జాతాద్భుతంబు (ము)