పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

పద్మపురాణము


క.

[1]కింకరవర్గం బపుడు భ
యంకర మగులోకమున కహంకృతితోడన్
హుంకారగర్జనలతో
శంకింపక పట్టి తెచ్చి జముకట్టెదురన్.

48


వ.

అమ్మనుజుని నిలువంబెట్టి యిట్లనిరి.

49


ఆ.

ద్రవిళవిభుఁడు వీఁడె దారుణపాతకుఁ
[2]దెచ్చినార మేమి తెఱుఁగు వీని
కనిన యముఁడు చూచి యతిరోషియై వాని
వరుస నరకములను వైవుఁ డనియె.

50


చ.

అనవుఁడుఁ గింకరప్రతతు లంతకు నానతి రాజుఁ గొంచుఁ జ
య్యనఁ జని ఘోరదుర్గతుల నప్పుడు ద్రోచి యనేకభంగులన్
మునుకొని బాధపెట్టుచును ముందటిపాపము లెన్ని తిట్టుచున్
గనుఁగొని ఘోరపాశములఁ గట్టఁగఁ గొట్టఁగ నార్తమూర్తియై.

51


వ.

అనేకనరకానుభవంబు చేయుచుండె నవ్విధం బెట్లన్నఁ దొలుత
తామిస్రనరకంబునం బడి వెడలి యనంతరంబ మహారౌరవ రౌరవ
కాలసూత్ర తాపన సంప్రతాపన కాకోల కశ్మల పూరిత మృత్తికా
లోహసంకుల మహాభీమ దుర్దమాసిపత్రవనాది బహువిధనరకంబుల
బహుక్లేశంబుల ననేకకాలం బనుభవించి యా [3]వివిధసంతాపన
నరకంబులం దీవ్రవేదనాపీడితుండయి విష్ణుద్వేషదోషంబున
నిబ్భంగిని డెబ్బదియొక్క యుగంబులు యమబాధలం బొరలి
యచ్చోటు వెలువడి వచ్చి.

52


క.

భూపాలుండు పిశాచం
బై పర్వతవిపినములను నత్యంతబుభు
క్షాపరవశుఁడై తిరుగుచు
నాపోవక కుంది కుంది యార్తధ్వనితోన్.

53
  1. కింకరులు దెచ్చిరంతభ (మ)
  2. డుగ్రు డేమి యాజ్ఞ యొసగు వీని (హై)
  3. యావిద్ధ (ము)