పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

147


ఆ.

విష్ణుఁ డెవ్వఁ డతఁడు విశ్వంబులోపల
నెచట నుండు నాతఁ డెట్టిదైన
మనుచు విష్ణునింద యనుదినంబును జేయు
నతఁడు దైవమోహితాత్ముఁ డగుచు.

42


క.

వైదికకృత్యము లొల్లఁడు
వేదంబులు[1]తడవిరేని వేరము గొనుఁ దా
నే దానంబులుఁ జేయక
వాదడుచుచునుండు విప్రవర్గముతోడన్.

43


శా.

పాషండాదుల[2]తోడఁ గూడుకొని పాపవ్యాప్తి గావించుచున్
వైషమ్యంబున దండనీతిపరుఁడై వైరంబునన్ భూప్రజన్
దోషాపాదనపీడ సేయుచు దయన్ దూలించి యుద్వృత్తుఁడై
రోషించున్ దగువారిఁ జూచిన మహాక్రూరైకసంచారుఁడై.

44


వ.

ఇవ్విధంబున నాచారదూరుండును, నగ్నిహోత్రవిముఖుండును
నై [3]యకాలయముండునుంబోలె జనంబుల శిక్షించుచు బహు
కాలంబు నేలఁ బాలించి యబ్భూపాలుండు కాలగోచరుం డగుటయు.

45


ఉ.

కాలుని కింకరుల్ వికృతకర్ములు నిష్ఠురరోషమూర్తులై
యోలి ననేకదండముల నుక్కఱ మోఁదుచుఁ జుట్టుముట్టి యా
భీలతఁ గ్రూరపాశములఁ బెంపఱఁగాఁ బెడకేలు గట్టి భూ
పాలుని నీడ్చికొంచు బహుభంగుల హుంకృతితో నదల్చుచున్.

46


వ.

అ ట్లత్యంతదారుణంబుగాఁ భాశంబులం గట్టుకొని చిత్రసేనుం
బట్టుకొని యతికఠినవిషమోపలంబునుం బ్రచండకిరణతప్తసికతా
మయంబును దరుచ్ఛాయావివర్జితంబును నంగారనదీప్రవాహ
సంకులంబును లోహతుండవాయసాక్రాంతంబును ఘోరశునక
వృకాదిక్షుద్రజంతువ్రజదంతురంబునగు కుటిలమార్గంబున నీడ్చి
కొనుచుం జని చని.

47
  1. చదివిరేని (ము)
  2. తోడివర్తనము లేపట్లం బ్రవర్తింపుచున్ (మ)
  3. కాలయముండు (తి-హై)