పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

పద్మపురాణము


సీ.

నీ నామ జలదంబు [1]నీట దేలక మోహ
        చటులానల మ్మెట్లు చల్లనాఱుఁ?
దనరు నీ నామౌషధమ్ము సేవింపక
        దురితరోగము లెట్లు తొలఁగిపోవుఁ?
బొలుపార నీ భక్తిపోతంబు లేకున్న
        నే రీతి భవవార్ధి నీఁదవచ్చుఁ?
జెలఁగి నీ పాదాబ్జముల [2]చొప్పుఁ దలఁపక
        కైవల్యగతి యెట్లు గానవచ్చు?


తే.

వెలయ నీ దానవరుల సేవింపకున్న
జన్మసంసారదుఃఖంబు సడలు టెట్లు?
గాన నే నిన్నెకాని యొక్కరు నెఱుంగ
సర్వధర్మంబులును నీవ జలజనేత్ర!

31


తరల.

నినుఁ దలంచిన దోషసంఘమ నీఱగున్; నరకాపదల్
మొనయ నేరవు; [3]ఘోరదుఃఖసమూహముల్ దలచూప లే;
వనయముం బరలోకసౌఖ్యము లందుచుండెడు వేడుకన్
వనజలోచన! కృష్ణ! వాసవవంద్య! నిన్ భజియించెదన్.

32


సీ.

భూతయోగజమైన చైతన్యమని నిన్నుఁ
         [4]గూర్మితోఁ జార్వాకు గొలుచు నెపుడు;
నానందసత్త్వవిధాద్వైతమగు బ్రహ్మ
         మని నిన్ను నద్వైతుఁ డాశ్రయించు;
సేవ్యసేవకభావభవ్యవర్తనమున
         నిను వేదవాది వర్ణించుచుండు;
పరఁగ నహింసయ పరమధర్మంబని
         జైనుండు నినుఁ జేరి సన్నుతించు.

  1. నీడజేరక (తి-హై)
  2. పొత్తు (హై)
  3. రోగ (తి-హై)
  4. గూర్మి చార్వాకుండు (తి-హై)