పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

143


ఆ.

పరమతత్త్వవిదులు పరతత్త్వ మీవని
యాత్మఁ దలఁపు [1]చునికి ననుదినంబు
నిర్మలస్వరూప! నిఖిలాండనాయక!
సత్త్వగుణగరిష్ఠ! జలజనేత్ర!

26


తే.

హరిహరాంబుజభవులు నా నలరు దీవ
[2]పుత్త్రమిత్రాదిమూర్తులఁ బొందు వీవ
యొక్కఁడవె పెక్కురూపులై యునికిఁ దలఁప
మూఢజనకల్పితము గాదు రూఢచరిత!

27


క.

[3]గణనీయచరిత! సాత్త్విక
గుణసాగర! శ్రీసమేత! గొనకొని నిను ని
ర్గుణమూర్తిగాఁ దలంతురు
ప్రణుత జగద్రక్ష! కృష్ణ! పంకజనయనా!

28


తే.

శుద్ధబుద్ధాత్మ! యత్యంతసుప్రసన్న!
సర్వతత్త్వజ్ఞ! శాశ్వత! సర్వసులభ!
సర్వభూతేశ! చిన్మయ! [4]సత్త్వసార!
నిన్ను భజియింతు నే ప్రొద్దు నియమ మెసఁగ.

29


క.

ప్రియముననైనను నిను న
ప్రియమునైనను జెలంగి పేర్కొనువారిన్
బ్రియబంధుఁడవై నీ న
వ్యయపదముల నిలుపుచుండు దంబుజనాభా!

30
  1. చుందు రనుదినంబు (మ-తి-హై)
  2. మిత్రపుత్రాదిమూర్తుల మెలగుదీవ (హై)
  3. గణనియమచరిత (ము)
  4. సత్యసార (తి-హై)