పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

పద్మపురాణము


నిగమము లెల్ల నీ నిశ్వాసములు గాన
        నేది భవత్ప్రీతిహేతు వరయ
నటుగాన నెబ్భంగి నభినుతిసేయుదు
        భక్తిభావంబునఁ బద్మనాభ!


ఆ.

యధికభక్తిఁ గోరి యాత్మలో వర్ణింప
నుత్సహించినాఁడ నుచితవృత్తిఁ
భక్తిమంతుఁ డెట్లు పలికినఁ దప్పుగా
నవధరింప వలవ దంబుజాక్ష!

21


క.

వేదము నిను వినుతింపఁగ
లేదఁట; వాఙ్మానసములు లేవఁట పొగడం;
గాదనక యెట్టు వొగడెద;
నాదరమున నన్నుఁ బ్రోవు మంబుజనాభా!

22


ఉ.

బ్రహ్మ యనంగ నిజ్జగము పన్నుగఁ బుట్టు వొనర్తు శుద్ధస
ద్భ్రహ్మ [1]నివాసభూతమగు బ్రహ్మము నారయ నీవె కావునన్
బ్రహ్మకు బ్రహ్మవైన నినుఁ బ్రస్తుతి చేసెద నన్నుఁ బ్రోవు మీ
బ్రహ్మ పురోగమామరవరస్తుతవర్తన! పుణ్యకీర్తనా!

23


ఆ.

నీవు నిద్రవొంద నిఖిలంబు నిద్రించు
నీవు మేలుకొనిన నిఖిలమెల్ల
దెలివిఁ బొందుఁ గానఁ దలపంగ నింతకుఁ
గారణంబు నీవ కమలనాభ!

24


ఉత్సాహ.

దేహసంగతుండవయ్యు దేహదోష మేమియున్
దేహమందుఁ బొంద వీవు దేవవంద్యపాద! సం
దేహ మింతలేదు చూడ దేవ! జీవకోటి కు
త్సాహమున్ సృజించియుండి తనరు దాత్మమూర్తివై.

25
  1. విధాన (తి-హై)