పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

141

రోమశుండు వేదనిధికి యోగసారస్తోత్రంబు సెప్పుట :

సీ.

విష్ణుసంబంధమై వెలసిన యీ కథ
         గంగాప్రవాహంబు గతి [1]వచింప
విని కృతార్థుఁడ నైతి వెండియు; విను వేడ్క
         మిగుల నచ్యుతుఁ డాత్మ మెచ్చునట్టి
దేవద్యుతిస్తోత్ర మే విధం బది నాకు
         నానతీవలయు సౌహార్దలీలఁ;
బుణ్యాత్మసంగమంబున నెట్టివారును
         బుణ్యాత్ము లనుమాట పొల్లుగాదు


ఆ.

సత్యనిరతి నీదు సద్గోష్ఠి నీ పుణ్య
కథలు వినఁగ నేఁడు గలిగె నాకు
ననిన నా స్తవంబు వినుము చెప్పెద నని
ప్రేమ మెసఁగఁ జెప్పె రోమశుండు.

18


వ.

ఇమ్మహాస్తవంబు తొల్లి వైనతేయుం డధిగమించె; నమ్మహాత్ము
వలన నే నభ్యసించితి; నధ్యాత్మగర్భసారంబును నఖిలసుఖాస్ప
దంబును నఖిలపాపహరంబును నగు నిది యెట్టి దనిన.

19


తే.

వాసుదేవ! మురాంతక! వనజనాభ!
భక్తవత్సల! కృష్ణ! కృపాసముద్ర!
హరి! జగన్మయ! కేశవ! పరమపురుష!
నీకు మ్రొక్కెదఁ గరుణింపు లోకవినుత!

20


సీ.

స్తోతయు నీవ సంస్తుత్యుండవును నివ
        శ్రుతియును నీవ విశ్రుతము గాఁగ
వెలయు సర్వంబును విష్ణుమయం బను
        వచనంబు గల్గుట వనజనాభ!

  1. రచింప (ము)