పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

139

దేవద్యుతికిఁ బుండరీకాక్షుండు ప్రత్యక్షం బగుట :

వ.

ఇవ్విధంబున నధికశాంతచిత్తుఁడై తపంబు సేయుచు, నిత్యం
బును వికచసుగంధికుసుమంబుల శ్రీమన్నారాయణుం బూజిం
చుచుఁ బురుషసూక్తవిధానంబున షోడశోపచారంబుల నర్చిం
చుచు[1]నప్పరమవైష్ణవుం డొక్కనాఁడు వై శాఖశుద్ధైకాదశియందు
నియమాచారుండై వేదోక్తంబైన వైచిత్రస్తవంబుఁ బఠియించు
చున్నంత.

10


చ.

సరసిజచక్రఖడ్గఘనశంఖము లొక్కట నాల్గుచేతులన్
బరువడిఁ గ్రాల నీలతనుభాసురకాంతి వెలుంగ లీలమై
నురమున లక్ష్మి పెంపొలయ [2]నుత్తమరత్నవిభూషితాంగుఁడై
హరి వెస నేగుదెంచె విహగాధిపు నెక్కి మునీంద్రు పాలికిన్.

11


వ.

ఇట్లు ప్రత్యక్షంబైన [3]పద్మాయతేక్షణు నిరీక్షించి యవ్విప్రుండు
సమ్మదాశ్రుకణకలితలోచనుండును బులకితశరీరుండును నై
సాష్టాంగదండప్రణామంబు లాచరించి లేచి నిలిచి నిటలతటఘటి
తాంజలియై యానందరసప్రవాహంబునం దేలి తన్నుం దా
నెఱుంగక యాడుచున్న నద్దేవుండు డాయం జనుదెంచి కరుణార్ద్ర
కటాక్షంబుల [4]నీక్షించి దరహసితవదనుం డగుచు గంభీరమధుర
వాక్యంబుల నతని కిట్లనియె.

12


సీ.

దేవద్యుతిద్విజ ధీయుక్తసన్యస్త
         కర్మబంధుండవై పేర్మితోడ
మన్మనస్కుండవై మదుపాశ్రయమున నన్
         గొలిచితి గావున నలఘుచరిత !

  1. బరమవైష్ణవుం డతం డొక్కనాఁడు (ము)
  2. నుజ్జ్వల (తి)
  3. నారాయణుం గాంచి య ప్పరమవైష్ణవుండు (హై)
  4. నిరీక్షించి (ము)