పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

పద్మపురాణము


క.

అందు సుమిత్రుండను ముని
నందనుఁ డత్యంతశుచిసనాతనమతి గో
విందపదపద్మసేవా
నందితమానసుఁడు సజ్జనస్తుతుఁ డెలమిన్.

5


వ.

దేవద్యుతి నామంబు గలిగి వర్తించుచుండె నమ్మహాత్ముండు.

6


సీ.

దావపావకతీవ్రతరమైన వేసవి
        రమణఁ బంచాగ్నిమధ్యమున నిల్చి
నీలనీరద[1]గణాభీలకాలంబున
        నెఱయ వృక్షంబులనీడ నిల్చి
[2]హిమవాతదారుణహేమంతదినముల
        నిష్ఠఁ బుక్కిటిబంటి నీరనుండి
పవనాంబుఫలమూలపల్లవాహారుఁడై
        దినదినం బాఁకలి దీర్చికొనుచు


తే.

విష్ణుపూజాసమేతుఁడై విపులనియతిఁ
బితృసమర్చనతర్పణవితతి సల్పి
తగిలి చాంద్రాయణాదివర్తనలఁ దపము
సేయుచును బుచ్చెఁ గాలంబు శిష్టనుతుఁడు.

7


ఆ.

వేదవేత్త యయిన విప్రుఁ డిబ్భంగుల
వ్రతము సలుపఁ జలుప వాని దేహ
మస్థిచయము దక్క నబ్భంగిఁ బదివేలు
వత్సరములు చనియె వరమునీంద్ర!

8


చ.

అతని తపఃప్రభావజసమంచితతేజము పేర్చి విష్టప
త్రితయమున న్వెలింగి కడుదీప్తి వహింపఁగ భూతకోటి య
ద్భుతము వహింప వహ్నియునుబోలె వెలింగెడు నమ్మునీద్రుంనిన్
సతతముఁ జూచి దేవమునిసంఘము [3]లెంతయు భీతిఁ బొందఁగన్.

9
  1. మహా(తి-హై)
  2. హిమపాత (తి-హై)
  3. లెల్లను (ము)