పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

పద్మపురాణము


మా.

క్షితిధరపతిధైర్యా! శ్వేతసత్కీర్తిధుర్యా!
వితరణగుణజాలా! విశ్రుతాచారలీలా!
పతిహితనయదక్షా! పద్మపత్రాయతాక్షా!
గతకలుష[1]నికారా! కందనామాత్యధీరా!

223


గద్య :

ఇది శ్రీ నృసింహవరప్రసాదలబ్ధకవితవిలాస భారద్వాజగోత్ర
పవిత్రాయ్యలామాత్యపుత్త్ర సరసగుణధుర్య సింగనార్యప్రణీతం
బైన పద్మపురాణోత్తరఖండంబునందు నింద్రుం డహల్యం బొం
దుటయు గౌతమశాపంబునం బదభ్రష్టుండై మాఘస్నానవిశేషం
బునఁ దనపదవిం బొందుటయుఁ బ్రయాగాది బహుతీర్థమహ
త్త్వంబును గంధర్వకన్యక లుత్సాహతీర్థంబున విప్రతనయునిం
గనుంగొని విరహాక్రాంత లగుటయు విప్రకుమార కన్యకాన్యోన్య
శాపకథనంబును పిశాచరూపంబులగు వారలు వేదనిధిం గనుం
గొనుటయు రోమశముని దర్శనంబును నతనివలన సకలతీర్థ
స్నాన[2]మహిమలు వినుటయు వీరసేనుచరితంబును భద్రక
చరితంబు నన్నది తృతీయాశ్వాసము.

224


  1. విహారా (తి), వికారా (తి)
  2. ఫలవిశేషంబులు (మ-తి-హై)