పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

135


సీ.

తెల్లమిగాఁ దొల్లి దేవద్యుతిఖ్యాతుఁ
        డగు బ్రాహ్మణుఁడు గలఁ డనఘమూర్తి
విష్ణుభక్తుఁడు సర్వవేదపారగుఁడు గృ
        పారసవారాశి చారుచరితుఁ
డొక్కనాఁ డొకచోట నొకపిశాచమునకు
        శాపమోక్షము సేసె సదయబుద్ధి
ననవుడు మునినాథ! యవ్విప్రుఁ డెవ్వఁ డె
        వ్వనిపుత్త్రుఁ డెట్టిచో నెవ్విధమున


తే.

నప్పిశాచంబుఁ గాచెను నవ్విధంబు
వినఁగ నాచిత్త మెంతయు వేడ్కఁ గదిరె
వెలయఁ దత్కథయంతయు విస్తరించి
సమ్మదంబున నా కానతిమ్ము నెమ్మి.

220


వ.

అనిన విని రోమశుండు సకలపుణ్యోదయంబగు నయ్యితిహాసంబు
చెప్పెద నాకర్ణింపుమని వేదనిధి కెఱింగించె ననినం దత్కథా
క్రమంబు వినవలతుం జెప్పవే యని యడుగుటయును.

221


ఉ.

భూరితర[1]ప్రభావ! గుణభూషణవైభవ! వజ్రహస్త! ది
క్పూరితకీర్తిలోల! సురభూరుహసన్నిభదానశీల! వి
ద్యారసికాంతరంగ! వినయాన్విత! సూనృతవాగ్విలాస! వి
స్తారవివేక! చిత్తభవసన్నిభ! సుందర! దైర్యమందిరా!

222


క.

సకలనృపనయవిశారద!
ప్రకటితదిక్చక్రవాళభాసురకీర్తీ!
సుకవిజనబంధుపోషణ!
మకరధ్వజసుభగరూప! మధురాలాపా!

223
  1. ప్రతాప (తి-హై)