పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

131


తే.

సప్తజన్మకృతాఘముల్ చటులవర్త
మానదురితంబు లెడఁబాయు మాఘతిథుల
యందు సుస్నాతుఁ డయ్యెనే నదియుఁ దీర్థ
ములను సేయంగఁ గల్గుట ముఖ్యఫలము.

205


శా.

ప్రాయశ్చిత్తములేని పాపములకుం బ్రవ్యక్తమై యుండఁగాఁ
బ్రాయశ్చిత్తము గల్గు[1]మాఘమున తీర్థస్నాన మెవ్వారికిం
జేయం గల్గినఁ జాలు మానవులకున్ శ్రేయస్కరంబై తుదిన్
శ్రీయుక్తంబగు నాకలోకసుఖముం జేకూరు నెల్లప్పుడున్.

206


వ.

మఱియును మాఘస్నానంబు హిమశైలోపరిభాగతీర్థంబులం
జేసిన నఖిలపాపహరణం బగుఁ[2]దత్తీర్థంబున నింద్రలోకప్రదం
బగు; బదరీవనతీర్థంబున సర్వకామఫలదంబై మోక్షంబిచ్చు; నర్మద
యందు దుఃఖహరంబై రుద్రలోకంబుఁ జెందించు; యమున
యందు సూర్యలోకంబు నిచ్చు; సరస్వతినదియందు బ్రహ్మ
లోకంబు నొసంగు;[3]విపాశయందు విశేషఫలం బొదవించు;
భాగీరథియందు విష్ణులోకంబు నొసంగు; పరయువును గండకి
యును సింధువును జంద్రభాగయును గౌశికయును దామ్ర
పర్ణియు గౌతమియు భీమరథియును దుంగభద్రయును గృష్ణ
వేణియును గావేరియు నను నివి మొదలుగాఁ గల తీర్థంబులను
సముద్రగాములగు నితరనదులను నాకలోకసౌఖ్యంబు నొందించు;
నైమిశారణ్యంబున విష్ణుసారూప్యంబుఁ జేయుఁ; బుష్కరంబున
బ్రహ్మసారూప్యంబు గలిగించుఁ; గురుక్షేత్రంబున దేవేంద్రాది[4]
లోకఫలంబుల నుత్పాదించు; దేవహ్రదంబున దేవత్వంబు నొం
దించుఁ; బ్రభాసంబున రుద్రగణత్వంబు నాపాదించు; హేమకూట
మహాకాలాహతామరనీలకంఠార్బుదతీర్థంబులందు రుద్రలోకంబు

  1. మాఘమను (ము)
  2. నచ్చోటితీర్థంబున (మ-హై)
  3. కాశియందు (ము)
  4. లోకంబుల (ము)