పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

పద్మపురాణము


సిద్ధించు; సర్వనదులందును నదీసంగమంబులను సర్వకామఫల
ప్రదం బగు. మఱియు సర్వనదులందుం బ్రయాగతీర్థంబు విశే
షంబు గావునఁ దత్ఫలంబు వివరించెద నెట్లనిన.

207


మ.

మకరార్కంబగు మాఘమాసమున[1]బ్రహ్మానందతీర్థంబునం
దొకకాలంబున మేను దోఁచిన యతం డుద్దామగర్భాలయ
ప్రకటక్లేశముఁ బొంద కచ్యుతసమీపం బొందునం చెల్లచో
నకలంకస్థితి సన్నుతింతురు ప్రయాగాఖ్యంబునన్ దేవతల్.

208


క.

కనుఁగొనరు నరక మెన్నఁడు
మనుజులు పుణ్యప్రయాగ మాఘస్నానం
బనయంబు మూఁడు దివసము
లొనరించినవారు ధాత్రి నుత్తమపురుషుల్.

209


తే.

[2]దానతీర్థవ్రతాధ్వరధర్మములును
మొగిఁ బ్రయాగాఖ్యసుస్నానమును విధాత
మొనసి తులఁబెట్టి తూఁచుచో ముల్లుచూపె
స్నాన మతిగురుత్వమున విశాలధర్మ!

210


సీ.

పవమానపానీయపత్రభోజనముల
        దేహంబు శోషిల్లు దినము దినము
యోగంబు సాధించుచున్నవారలు ప్రయా
        గస్నాతుఁ డరిగెడు గతికిఁ బోవ
రందు మాఘములోన నవగాహ మొనరించు
        నట్టి పావనుల గేహాంగణముల
[3]గంధమదామోదకలితషట్పదగాన
        సౌమ్యంబులై యొప్పు[4]సామజములు

  1. బ్రహ్మంబైన (ము)
  2. తే. దానతీర్థవ్రతాధ్వరధర్మములను
    మొగి బ్రయాగతో దూచెను మును విధాత
    దాని సరిపోల్పరాకున్న ధరణిలోన
    నిదియ మోక్షంబు నరులకు నెల్ల యనుచు.

    వ. మరియు బ్రయాగకు సమంబు క్షేత్రంబు లేదనిన (హై)
  3. గండ (తి)
  4. సామజముల (ము)