పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

పద్మపురాణము


సీ.

రోమశముని మహోద్దామతేజంబున
         దందహ్యమానులై తల్లడిల్లి
యతనిముందట నిల్వ నసమర్థులై యటఁ
         దొలఁగి యంతంతన నిలిచి; రప్పు
డవ్వేదనిధి విప్రుఁ డల్లన సనుదెంచి
         యమ్మహామునికి సాష్టాంగ మెరఁగి
[1]మాభాగ్యవశమున మహనీయ! యిప్పు డీ
        తీర్థంబునకు నరుదెంచినాఁడ;


తే.

వనఘ! సజ్జనసంగమం బఖిలదోష
హరణమై పుణ్యసౌఖ్యంబు లందు నరున;
కట్లు గావున నేడు[2]నీయట్టి పుణ్య
పురుషుఁ బొడఁగంటి మంటి నే దురితరహిత!

201


వ.

అని ప్రియంబులు పలికి రోమశమహామునికిం దద్వృత్తాంతం
బంతయుం జెప్పి వీరు గంధర్వకన్యకలు. వాఁడు మదీయ
పుత్త్రుండు. వీరలకు నాశాపవిముక్తి యగు తెఱం గానతిమ్మని
గద్గదకంఠుండై [3]యడిగిన వేదనిధిం గరుణించి యమ్మునీం
ద్రుం డిట్లనియె.

202


క.

వెఱవఁగ నేటికి వీరిం
దఱుఁ గడువికృతంబులైన తమదోషములం
దొఱఁగి సుఖించెడు మార్గం
బెఱిఁగించెద నీకు నే నహీనగుణాఢ్యా!

203


వ.

అది యెట్లనిన నిద్దోషం బొండువిధంబునం బొలియనేరదు. వీర
లిందఱు నాతోడం జనుదెంచి మాఘస్నానంబు సేసిరేని వికృత
రూపంబు లణంగి దివ్యశరీరులై సుఖియింతు రని చెప్పి రోమ
శుండు మఱియు నిట్లనియె.

204
  1. భాగ్యవశమ్మున మహనీయ యిప్పు డీ (ము-యతిభంగము)
  2. మీ (తి-హై)
  3. హస్తంబులు మోడ్చియున్న (హై)