పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

125


తే.

పణఁతు లందఱు తనుఁ జిక్కఁ బట్టినపుడు
నిండుమనమునఁ దలఁకక యుండె నతఁడు
పసిఁడిగను లన్నిదిక్కులఁ బ్రజ్వలింప
మండితంబగు చల్లనికొండ యనఁగ.

169


వ.

ఇ ట్లయ్యింతులు చుట్టుముట్టి పట్టుకొనుటయు నిట్టట్టు గదలనేరక
యిట్టలంబుగఁ దట్టుముట్టుపడి దిట్టతనంబున నెట్టకేలకు నిట్లనియె.

170


ఉ.

అక్కట! బ్రహ్మచర్య మిటు లాఱడివోవఁగ నన్ను నేల మీ
రక్కటికంబుమాలి వెస నంటఁగఁ బట్టినవారు మీకు నే
నొక్కటి చెప్పెద న్వినుఁడు యుక్తముగా దొరకొన్నవేద మిం
పెక్కఁ బఠించు నంతకు వరించుట ధర్మము గాదు కాంతలన్.

171


క.

దొరకొన్న వ్రతము విడిచిన
దురితంబగు నట్లు గానఁ దొయ్యలులారా!
కరుణించి నన్ను విడువుఁడు
పురుషార్థము సేయుఁ డేను బోయెద నిచ్చన్.

172


వ.

అని పరిహరించిన నవ్విప్రోత్తముం గనుంగొని కలకల నవ్వుచుఁ
గలకంఠకంఠు లిట్లనిరి.

173


క.

[1]ధర్మము నర్థముఁ గామము
నర్మిలి యొకటొకటితోడి యనుబంధముగాఁ
బేర్మి భజియించువారికి
నిర్మలగతి గలుగునండ్రు నిగమోక్తవిధిన్.

174


వ.

అని యెయ్యవి యంటేని.

175


ఆ.

ఆర్తులైన [2]వారి ననుకంపఁ బ్రోచుట
పరమధర్మ మేము పత్ను లగుట
నర్థకామసిద్ధి యగు నంతమీఁదటఁ
బుత్త్రలాభ మొదవుఁ బుణ్యచరిత!

176
  1. ధర్మముగ నర్థకామము (హై)
  2. మమ్ము (మ-తి-హై)