పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

పద్మపురాణము


వ.

ఇట్లు సూర్యోదయంబున నక్కన్నియలకుం జెలికత్తెలు దిన
ముఖోచితక్రియలు సేయించి యా మునికుమారునిం గనుంగొనిన
యచ్చోటితీర్థంబుకడకుం గొనిపోయి గౌరీసమారాధనంబులు
సేయుచు నాటపాటలవెరగున నమ్మరులు మఱపింప నవ్వామ
నయన లమ్మునికుమారుండు చనినమార్గం బీక్షించుచు నొండు
దలంపు లుడిగి [1]యుండిరి.

164


ఉ.

అప్పుడు బ్రహ్మచారి రయమారఁగ [2]వచ్చె సరోవరంబునం
దొప్పుగఁ దీర్థమాడ [3]నని యుజ్జ్వలరూపముతోడఁ బల్మఱుం
దప్పక కన్యకాజనులు తన్నుఁ బ్రియంపడి చూచుచుండఁగా
నెప్పటియట్ల తా వికృతి యెద్దియు లేక మనోముదంబునన్.

165


క.

అయ్యువిదల నెమ్మనముల
నెయ్యంపురసంబు లుబ్బి నిట్టలు వొడువం
జెయ్యాడ కతని డగ్గఱి
రొయ్యనఁ గనుఁగొనలఁ గలికి [4]యులుకులు చిలుకన్.

166


క.

తొలునాఁడును మైవంచనఁ
దొలగుటఁ దలపోసి సతులు దురఁదురఁ జని తా
రలసుపడనీక విప్రుని
నలుఁగడ నరికట్టి పట్టి నగుమోములతోన్

167


క.

ఎక్కడికిఁ బోవ వచ్చుం
జిక్కితి గా కింక విప్రశేఖర! మాచే
నిక్కముగ ననుచు నతనికి
వెక్కసముగ [5]నలదిపట్టు విడువకయున్నన్.

168
  1. యుండు నవసరంబున (తి-హై)
  2. వచ్చి (తి-హై)
  3. మాడిచని (తి-హై)
  4. యలుకలు (ము-యతిభంగము)
  5. నల్గిపట్టి (ము)