పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

పద్మపురాణము


పొడవైన తరులెక్కి భూసురోత్తమ! యని
       పలుమాఱు దీనతఁ బిలిచి బిలిచి
వాఁగులు వ్రంతలు వనజాకరంబులు
       చొచ్చి విచ్చలవిడిఁ జూచి చూచి


ఆ.

వడుగురూప మెందుఁ బొడగాన నేరక
విరహవహ్నిచేత వెచ్చి వెచ్చి
యుదయుఁడైన కాము నమ్ములఁ దొడిఁబడి
మానధనము [1]లురిలి మగువ లపుడు.

139


ఉ.

కాననభూమి నిర్జనము గావున నయ్యెడ నుంటఁజేసి తా
మానధనంబుఁ జిత్తమును మన్మథచోరుఁడు గొంచు నేగినన్
దీనతనొంది కుంది సుదతీమణు లచ్చొటు వాసి యిండ్ల కె
ట్లేనియు వచ్చి రేటి కెదు[2]రీఁదెడు కైవడి నార్తచిత్తలై.

140


వ.

ఇట్లు తదీయప్రేమపాశ[3]బద్ధచిత్త లై యిండ్లకుం జని యమ్ము
నీంద్రువలని వలవంత యంతంకంత కతిశయింపఁ దమ్ముఁ దా
మెఱుంగక యున్నంత.

141


ఉ.

అత్తరలాయతాక్షులు ప్రియంబగు నమ్మునినాథురూప మ
చ్చొత్తినభంగి నెమ్మనములందుఁ జెలంగఁగఁ బంచబాణుచేఁ
జిత్తము లొత్తగిల్లి పలుచింతలఁ జేడ్వడి మ్రానుపాటుతోఁ
జిత్తరురూపులం బురుడుసేయుచుఁ జేష్టలు దక్కి రయ్యెడన్.

142


వ.

మఱియును.

143


ఉ.

తల్లులు సీరిన న్వినక దాదులదిక్కును జూడ కంగముల్
డిల్లము నొంది ధైర్యములు డింద మనోభవబాణసంహతిం
దల్లడమంది మైమఱచి[4]తద్దయు మోములు వంచి చెక్కులం
బెల్లుగఁ గన్నునీ రురల భీతమృగేక్షణ లుండి వెండియున్.

144
  1. లుడిగి (ము)
  2. రేగిన (ము)
  3. బద్ధులై (ము)
  4. దందడి(మ-తి)