పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

పద్మపురాణము


ఆ.

పతి యితండు నాకుఁ బ్రాణేశు డీతఁడు
వీఁడు తనకు మగఁడు వీఁడు భర్త
నాకు[1]నితని నేన చేకొందు నని కన్య
లేవురును ననంగ నిచ్చ నతఁడు.

125


మ.

విని మాధ్యాహ్నికవర్తనంబులు గడు న్వేవేగఁ గావించి చిం
తన సేయం దరుణీజనం బఁట సముద్యత్ప్రీతితోనున్న దీ
వనితామాయలచేతఁ దొంటిమునులున్ వాయోడి పుష్పాస్త్రుచే
ఘనధైర్యంబులు గోలుపోయి మిగులం గాసిల్లినా రక్కటా!

126


క.

[2]ఏపున నింతులచూపుల
తూపులు భ్రూధనువునందుఁ దొడిగి మరుఁడు దు
ర్వ్యాపారవిటమృగంబులఁ
[3]బాపంబన కేయ నడ్డపడ నొరు వశమే?

127


ఆ.

మదము గదురఁ జేసి మది మోహ మెక్కించి
చూపుదీఁగెలందుఁ జుట్టుకొల్పి
యెట్టి మునులనైన నెట్టనఁ జెడఁ జూతు
[4]రంగవించిరేని యబ్జముఖులు.

128


ఆ.

బుద్ధిమంతులైన పురుషుల కంగనా
జనులఁజేరి యునికి చనదు గాన
నీ సరోజవదన లిటఁ నన్ను [5]గదియక
యుండ నింటి కరుగు టొప్పు ననుచు.

129


వ.

ఉన్నయెడ.

130


ఉ.

అంత వధూజనంబు తను నయ్యెడఁ బట్టఁదలంచి వచ్చుచో
నంతకుమున్న వైష్ణవమహత్వము గల్గినవాఁడుగాన ని
శ్చింతుఁడు బ్రహ్మచారి కడుఁజిత్రము గాఁగ నదృశ్యమూర్తియై
యింతుల మోసపుచ్చి చనియెం బ్రమదంబునఁ దీవ్రవేగుఁడై.

131
  1. విభు డటంచు నలినదళాక్షులు, నేవురును (హై)
  2. ఏపుల (ము)
  3. పాపంబున నేయ (ము)
  4. రగ్గలించిరేని (మ-తి)
  5. లిట్లునన్ (ము)